Abn logo
Sep 25 2021 @ 15:38PM

విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్‌గా మజ్జి శ్రీనివాసరావు

విజయనగరం: జడ్పీ సభ్యులుగా జడ్పీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. 34 మంది సభ్యుల చేత కలెక్టర్ సూర్యకుమారి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానికి మంత్రులు బొత్సా సత్యనారాయణ, పాముల పుష్పశ్రీ వాణి, ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, మాధవి, ఎమ్మెల్యేలు హాజరైనారు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా మజ్జి శ్రీనివాసరావును ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్‌గా, మరిసర్ల బాపూజీ నాయుడు, వెంకట అనిల్ కుమార్‌ను సభ్యులు ఎన్నుకున్నారు. ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లను పుష్ప గుచ్ఛాలుతో  మంత్రులు బొత్సా సత్యనారాయణ, పాముల పుష్పశ్రీ వాణి, ఎంపీలు, ఎమ్మెల్యేలు అభినందించారు.