మేజర్‌ సమస్యలు

ABN , First Publish Date - 2021-02-26T04:21:49+05:30 IST

ఎర్రగొండపాలెం మేజర్‌ పంచాయతీలో సమస్యలు తిష్ఠ వేశాయి.

మేజర్‌  సమస్యలు
హైవే రోడ్డు పక్కన జరగని కాలువ నిర్మాణం


ఎర్రగొండపాలెం 

పంచాయతీలో సౌకర్యాలు కరువు

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

పన్నుల రూపంలో 

మంచి ఆదాయం

అభివృద్ధి విషయంలో 

అధికారుల నిర్లక్ష్యం

 ఎర్రగొండపాలెం, ఫిబ్రవరి 25: ఎర్రగొండపాలెం మేజర్‌ పంచాయతీలో సమస్యలు తిష్ఠ వేశాయి. పేరుకే మేజర్‌ పంచాయతీ తప్ప కనీస సౌకర్యాలు కరువే.  హైవే రో డ్డుకు పడమర వైపున 10 సంవత్సరాలుగా కాలువను నిర్మించడంలో అధికారులు, పాలకులు దృష్టి సారించలేదు. 200 మీటర్ల పొ డవున కాలువ నిర్మాణం జరగకపోవడంతో మట్టి కాలువలో చెత్త పేరుకుపోయి ప్రధాన రోడ్డుపై వెళ్లే వారు తీవ్రమైన కంపుతో ఇ బ్బంది పడుతున్నారు. ప్రధాన సెంటర్‌ నుం చి ఎటువైపు చూసినా కిలో మీటర్‌ దూరం వ్యాప్తి చెంది, 25 వేలకు పైగా జనాభా ఉ న్నారు. మేజర్‌ పంచాయతీ అయిన తర్వాత వాణిజ్య సముదాయాలు పెరిగాయి. దీంతో పంచాయతీకి అన్ని రకాలుగా పన్నుల ద్వా రా మంచి ఆదాయం సమకూరుతోంది. అ యినా అభివృద్ధి పనుల విషయంలో పాలకులు దృష్టి సారించడంలేదు. చినుకు పడితే వీధులన్నీ బురదమయంగా మారుతాయి. కాలువలు లేక మురుగు నీరు రోడ్లపైనే ప్రవహిస్తుంది. ఎర్రగొండపాలెం టౌన్‌లో రా మాలయం వద్ద నుంచి అంబేడ్కర్‌ బొమ్మ వరకు ఆర్‌అండ్‌బీ రోడ్డుకు ఇరువైపులా ఉన్న కాలువలు ప్రధాన కాలువకు లింక్‌ చేయకపోవడంతో మురుగు నీరు నిల్వ ఉండి కంపుకొడుతోంది. కొలుకుల రోడ్డుకు ఇరువైపులా రూ.20 లక్షలతో నిర్మించిన కాలువలో ము రుగు ముందుకు కదలడం లేదు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు పంచాయతీలో మౌ లిక వసతుల కల్పనకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. 




Updated Date - 2021-02-26T04:21:49+05:30 IST