బ్రహ్మోత్సవాలకు మైసిగండి ఆలయం ముస్తాబు

ABN , First Publish Date - 2020-11-29T05:30:00+05:30 IST

బ్రహ్మోత్సవాలకు మైసిగండి ఆలయం ముస్తాబు

బ్రహ్మోత్సవాలకు మైసిగండి ఆలయం ముస్తాబు
విద్యుత్‌ దీపాల అలంకరణలో ఆలయం

  • నేటి నుంచి 6వ తేదీ వరకు వేడుకలు
  • కొవిడ్‌ నిబంధనలు అనుసరించి భక్తులకు ఏర్పాట్లు

కడ్తాల్‌: పేదల ఇలవేల్పు, శక్తి స్వరూపిణిగా వెలుగొందుతూ ప్రసిద్ధి చెందిన మైసిగండి మైసమ్మ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌ 6వ తేదీ వరకు కొనసాగే ఉత్సవాల నేపఽథ్యంలో ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆదివారం ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ రమావత్‌ సిరోలి పంతు, ఈవో స్నేహలత పరిశీలించారు. కొవిడ్‌-19 నిబంధనలు అనుసరించి భక్తులకు ఏర్పాట్లు చేశారు.


బ్రహ్మోత్సవాల వివరాలు..


బ్రహ్మోత్సవాల వివరాలను ఆలయ ఈవో స్నేహలత వివరించారు. 30న క్షీరాభిషేకం, విశేష అలంకరణ, కుంభ హారతి, రాత్రి కార్తీక దీపోత్సవం, డిసెంబర్‌ 1న విశేష పూజలు, కార్తీకోత్సవం, 2న చండీహోమం, పుష్పరథోత్సవం, 3న చండీహోమం, పూర్ణాహుతి, పెద్దరథోత్సవం, 4న పుష్పార్చన, 5న విశేష పూజలు, అర్చనలు, 6న అమ్మవారికి వివిధ కూరగాయలతో అలంకరణ, బండ్లు తిప్పుట కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-11-29T05:30:00+05:30 IST