నిబంధనల మేరకే దుకాణాల నిర్వహణ

ABN , First Publish Date - 2020-05-22T10:58:11+05:30 IST

ప్రభుత్వ నిబంధనల మేరకే దుకాణాలను నిర్వహిం చాలని కలెక్టర్‌ జె.నివాస్‌ వ్యాపారు లకు సూచించారు.

నిబంధనల మేరకే దుకాణాల నిర్వహణ

గుజరాతీపేట, మే 21: ప్రభుత్వ నిబంధనల మేరకే దుకాణాలను నిర్వహిం చాలని కలెక్టర్‌ జె.నివాస్‌ వ్యాపారులకు సూచించారు. గురువారం జడ్పీ సమావేశ మందిరంలో వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లా డారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకే దుకాణాలను తెరవాలన్నారు. సగం మంది సిబ్బందితోనే దుకాణాలను నిర్వహించాలని, ఐదుగురు కొనుగోలుదారులను మాత్రమే షాపులోకి అనుమతించాలని ఆదేశించారు. భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు. లిప్టుల్లోని  స్విచ్‌లు,  హ్యాండిల్స్‌, వంటి పరికరా లకు ఎరుపు రంగు వేయించాలని, వాటిని హైపోకోరైడ్‌ ద్రావణంతో పరిశుభ్రపరు స్తుండాలని సూచించారు. వస్త్ర, బంగారు, చెప్పుల షాపులను తెరించేందుందుకు అనుమతి లేదన్నారు.


సెలూన్ల నిర్వహణపై కొత్తగా గైడ్‌లైన్స్‌ వచ్చాయన్నారు. సెలూ న్ల నిర్వాహకులకు ఖచ్చితంగా గౌజులు, మాస్కులు ఉండాలన్నారు. నిత్యావసరాలు, ఫార్మశీ, వ్యక్తిగత దుకాణాలు, ఎలక్ట్రికల్‌, హార్డ్‌వేర్‌  దుకాణాలను తెరుచుకోడానికి ప్రభుత్వ అనుమతి ఉందన్నారు. నగదు రహిత వ్యాపారానికి ప్రాధాన్యత ఇవ్వాల న్నారు. డెబిట్‌ కార్డు ద్వారా లావాదేవీలు చేపట్టాలన్నారు.  ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి నాగేశ్వరరావు, జీఎస్‌టీ అసిస్టెంట్‌ అధికారి అరుణకుమారి, సహాయ కార్మిక శాఖాధికారులు కొండలరావు, రాధాకుమారి, శ్రీకాకుళం నగర పాలక సహాయ కమిషనర్‌ శివప్రసాద్‌, పాలకొండ, పలాస, ఆమదాలవలస, రాజాం, ఇచ్ఛాపురం మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-05-22T10:58:11+05:30 IST