Abn logo
Mar 27 2020 @ 05:35AM

శ్రీరామనవమిని ఇళ్లలోనే నిర్వహించండి

నువ్వలరేవు గ్రామస్థులకు ఎమ్మెల్యే అప్పలరాజు సూచన


వజ్రపుకొత్తూరు, మార్చి 26:  కరోనా వ్యాధి తీవ్రతతో ప్రతి ఒక్కరూ  శ్రీరామనవమిని ఇళ్లలో నిర్వహించుకోవాలని  పలాస ఎమ్మెల్యే డాక్టర్‌ అప్పలరాజు సూచించారు. గురువారం నువ్వలరేవులో గ్రామపె ద్దలతో మాట్లాడారు.  ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. అయితే ప్రస్తు తం  కరోనా తీవ్రత దృష్ట్యా ఉత్సవాలు బృందాలుగా కాకుండా ఎవరి ఇంటిలో వారే జరుపుకోవాలని   గ్రామపెద్దలను సూచిం చారు. గ్రామంలోకి వలసలు అధికంగా ఉండడంతో  వారిని క్వారెంటైన్‌లో ఉంచా లని తెలిపారు. సీఐ రాము మాట్లాడుతూ ప్రస్తుతం 144 సెక్షన్‌ అమలులోఉండడంతో  ఉత్సవాలు నిర్వ హించవద్దని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఐ గోవిందు, ఎంపీడీవో ఈశ్వరమ్మ, ఉదయకుమార్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement