భవన నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలి

ABN , First Publish Date - 2021-06-24T05:31:51+05:30 IST

భవన నిర్మాణాల్లో నాణ్యత ప్రమా ణాలను కచ్చితంగా పాటించాలని పెదలబుడు సర్పంచ్‌ పెట్టెలి దాసుబాబు అన్నారు.

భవన నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలి
నిర్మాణంలో వున్న ఆర్‌బీకే భవనాన్ని పరిశీలిస్తున్న సర్పంచ్‌, తదితరులు

పెదలబుడు సర్పంచ్‌ పెట్టెలి దాసుబాబు


అరకులోయ, జూన్‌ 23: భవన నిర్మాణాల్లో నాణ్యత ప్రమా ణాలను కచ్చితంగా పాటించాలని  పెదలబుడు సర్పంచ్‌ పెట్టెలి దాసుబాబు అన్నారు. బుధవారం ఆయనతో పాటు పంచాయతీ కార్యదర్శి శేఖర్‌బాబు, వార్డు సభ్యులు కలిసి పంచాయతీ పరిధిలో జరుగుతున్న పలు భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న భవనాలు పది కాలాలపాటు పదిలంగా ఉండేలా నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో వున్న సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల భవనాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ విజయనిర్మల, పంచాయతీ వార్డు సభ్యులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.  


Updated Date - 2021-06-24T05:31:51+05:30 IST