Abn logo
Jul 13 2020 @ 10:04AM

వెబ్ సిరీస్‌గా చ‌లం ‘మైదానం’

డిజిట‌ల్ మీడియాకు ప్రాధాన్య‌త పెరుగుతోన్న నేప‌థ్యంలో కొత్త కొత్త కాన్సెప్ట్‌లు ప్రేక్ష‌కుల‌ను చేర‌డానికి మార్గాలు సుల‌భ‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో మ‌న మేక‌ర్స్ తెలుగు సాహిత్యంలో టాప్ మోస్ట్ న‌వ‌ల‌లు, సీరియ‌ల్స్‌పై క‌న్నేశారు. అందులో భాగంగా ఇప్ప‌టికే ‘షాడో’ న‌వ‌ల‌ను సినిమా రూపంలో తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌క‌టించింది. ఇప్పుడు మ‌రో ప్రముఖ న‌వ‌ల వెబ్ సిరీస్ రూపంలో తెర‌కెక్క‌నుంది. వివ‌రాల్లోకెళ్తే చ‌లం రాసిన ‘మైదానం’ న‌వ‌ల ఆధారంగా వెబ్ సిరీస్ రూపొంద‌నుంది. ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల నిర్మాత‌గా మారి ‘మైదానం’ వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కిస్తున్నారు‌. తెలుగు ఓటీటీ ఆహా కోసం ఈ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్న‌ట్లు వేణు ఊడుగుల తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement