యజమానురాలికి తెలియకుండా పనిమనిషి నిర్వాకం.. రూ.50వేలు చెల్లించమన్న న్యాయస్థానం!

ABN , First Publish Date - 2022-02-15T17:50:50+05:30 IST

యూఏఈలోని అల్ ఐన్‌లో యజమానురాలికి తెలియకుండా ఓ పనిమనిషి చేసిన నిర్వాకంపై తాజాగా అక్కడి న్యాయస్థానం తీర్పునిచ్చింది.

యజమానురాలికి తెలియకుండా పనిమనిషి నిర్వాకం.. రూ.50వేలు చెల్లించమన్న న్యాయస్థానం!

అల్ ఐన్: యూఏఈలోని అల్ ఐన్‌లో యజమానురాలికి తెలియకుండా ఓ పనిమనిషి చేసిన నిర్వాకంపై తాజాగా అక్కడి న్యాయస్థానం తీర్పునిచ్చింది. యజమానురాలికి 2,574 దిర్హమ్స్(రూ.52,998) చెల్లించాలని పనిమనిషిని ఆదేశించింది. కోర్టులో పేర్కొన్న వివరాల ప్రకారం.. అల్ ఐన్‌లో ఉండే ఓ యజమానురాలు తన వద్ద పనిచేసిన పనిమనిషిపై స్థానిక కోర్టులో 3వేల దిర్హమ్స్(సుమారు రూ.61వేలు) దావా వేసింది. ఇంతకు పనిమనిషి చేసిన నేరం ఎంటో తెలుసా? యజమానురాలికి తెలియకుండా ఇంట్లోని ల్యాండ్‌లైన్‌ ద్వారా స్వదేశంలో ఉండే తన వారితో  పనిమనిషి అంతర్జాతీయ కాల్స్ మాట్లాడడం. దాంతో యజమానురాలికి ఏకంగా 2,574 దిర్హమ్స్(రూ.52,998) ఫోన్ బిల్లు వచ్చింది. 


అలాగే తన వద్ద పనిచేసే సమయంలో కిచెన్‌లో కొన్ని ఖరీదైన వస్తువులను పగలగొట్టిందని, దానికి తాలూకు మరో 2వేల దిర్హమ్స్ చెల్లించాలని పేర్కొంది. ఇవన్నీ చెల్లించకుండా ఉన్నట్టుండి తన వద్ద పని మానేసి చెప్పకుండా పారిపోయిందని న్యాయస్థానంలో యజమానురాలు నివేదించింది. ఫోన్ బిల్లుకు సంబంధించిన ఆధారాలను కూడా కోర్టు ముందు ఉంచింది. వాటిని పరిశీలించిన న్యాయస్థానం పనిమనిషి ఇంటర్నెషనల్ కాల్స్ మాట్లాడినట్లు తేల్చింది. అందుకే తాని తాలూకు 2,574 దిర్హమ్స్(రూ.52,998) చెల్లించాలని పనిమనిషిని ఆదేశించింది. కాగా, కిచెన్ సామాగ్రి సంబంధించి యజమానురాలు చేసిన ఆరోపణను కోర్టు తోసిపుచ్చింది. ఎందుకంటే దానికి సంబంధించిన ఆధారాలను యజమానురాలు చూపించలేకపోయింది. 

Updated Date - 2022-02-15T17:50:50+05:30 IST