పనిమనిషిగా వచ్చి.. ఇంట్లో యజమాని లేని వేళ ప్రియుడిని లోపలికి రానిచ్చింది.. ఆ తరువాత అతను ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2021-11-07T12:35:57+05:30 IST

పర్విందర్ సింగ్ ఢిల్లీలో ఒక పెద్ద వ్యాపారవేత్త. ఆయన తన భార్య హర్మీత్, కుమారుడితో ఒక ఖరీదైన విల్లాలో ఉంటున్నాడు. ఇంట్లో పనిమనిషి మానేయడంతో.. ఒక కొత్త పనిమనిషి కోసం ఏజెన్సీ వాళ్లని సంప్రదించారు. అలా ఏజెన్సీ తరపున హేమ అనే పనిమనిషి వారి ఇంట్లో కుదిరింది...

పనిమనిషిగా వచ్చి.. ఇంట్లో యజమాని లేని వేళ ప్రియుడిని లోపలికి రానిచ్చింది.. ఆ తరువాత అతను ఏం చేశాడంటే..

పర్విందర్ సింగ్ ఢిల్లీలో ఒక పెద్ద వ్యాపారవేత్త. ఆయన తన భార్య హర్మీత్, కుమారుడితో ఒక ఖరీదైన విల్లాలో ఉంటున్నాడు. ఇంట్లో పనిమనిషి మానేయడంతో.. ఒక కొత్త పనిమనిషి కోసం ఏజెన్సీ వాళ్లని సంప్రదించారు. అలా ఏజెన్సీ తరపున హేమ అనే పనిమనిషి వారి ఇంట్లో కుదిరింది.


హేమ మంచి పనిమంతురాలు అని ఇంట్లో యజమాని కూడా కొనియాడారు.. అంతలా వారి నమ్మకం సంపాదించింది. అలా కొన్ని రోజుల తరువాత నవంబర్ 2న పర్విందర్ తన బిజినెస్ పనిమీద వేరే ఊరికి వెళ్లాడు. హేమకు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక గదిని కేటాయించారు. ఆ రోజు హర్మీత్ సోదరి అతిథిగా వచ్చింది. ఇంట్లో హరీత్‌తోపాటు, ఆమె కుమారుడు, సోదరి ఉన్నారు. అర్ధరాత్రి హేమ లేచి ఇంటి గేటు తీసి బయట నుంచి ఒక వ్యక్తిని లోపలికి రానిచ్చింది.


అతనెవరో కాదు హేమ బాయ్‌ఫ్రెండ్ రమాకాంత్. అతను ఇంటిని బాగా సోదాచేసి తన మిత్రులకు ఫోన్ చేశాడు. కాసేపట్లో మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. రమాకాంత్, తన ఇద్దరు స్నేహితులతో కలిసి హర్మీత్ గది వద్దకు వెళ్లారు. అక్కడ హేమ.. హర్మీత్ గది తలుపులు తట్టి ఆమెను లేపింది. హర్మీత్ బయటికి రాగానే.. రమాకాంత్ ఆమె నోరు తన చేతులతో నొక్కేసి తన వద్దనున్న కత్తిని చూపించి.. చెప్పినట్లు చేయకపోతే చంపేస్తానని బెదిరించాడు.


ఆ తరువాత రమాకాంత్ స్నేహితులు హర్మీత్ గదిలోకి వెళ్లి అక్కడ నిద్రపోతున్న ఆమె కుమారుడు, సోదరిని బంధించేశారు. ఇంట్లోని లాకర్ తాళాలు లాక్కొని.. అందులో నుంచి రూ. 2కోట్లు నగదు, సమారు రూ.50 లక్షల బంగారం దోచుకొని పారిపోయారు. వారు వెళ్లిన తరువాత హర్మీత్ తన చేతులకున్న తాళ్లను ఎలాగోలా విప్పుకొని.. మిగతా వారి కట్లు కూడా విప్పింది. వెంటనే తన భర్త పర్విందర్‌కు ఫోన్ చేసింది. పర్విందర్ తను ఉదయం వరకు చేరుకుంటానని..  పోలీసులకు వెంటనే ఫోన్ చేయమన్నాడు. ఆ తరువాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు.


హర్మీత్ పోలీసులకు జరిగినదంతా వివరించింది. పోలీసులు హేమను పంపిన ఏజెన్సీ వారిని పట్టుకొని విచారణ చేశారు. ప్రస్తుతం హేమ, రమాకాంత్ కోసం పోలీసులు  గాలిస్తున్నారు.


Updated Date - 2021-11-07T12:35:57+05:30 IST