Rahul T-shirt issue: బీజేపీ హద్దులు మీరుతోందంటూ మహువా మొయిత్రా ఫైర్

ABN , First Publish Date - 2022-09-10T22:45:38+05:30 IST

'భారత్ జోడో యాత్ర'లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధరించిన టీ-షర్ట్ ధరపై బీజేపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించడంపై..

Rahul T-shirt issue: బీజేపీ హద్దులు మీరుతోందంటూ మహువా మొయిత్రా ఫైర్

కోల్‌కతా: 'భారత్ జోడో యాత్ర'లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul ganhdi) ధరించిన టీ-షర్ట్ (T-shirt) ధరపై బీజేపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించడంపై తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) ఫైర్ బ్రాండ్ ఎంపీ మహువా మొయిత్రా (Mahua moitra) నిప్పులు చెరిగారు. ''బీజేపీకి సీరియస్‌గా సలహా ఇస్తున్నాను. వ్యక్తుల డ్రస్సింగ్‌పై, ముఖ్యంగా విపక్షాలపై చేస్తున్న వ్యాఖ్యల విషయంలో హద్దులు దాటకండి. బీజేపీ ఎంపీల వాచీలు, పెన్నులు, షూలు, ఉంగరాలు, దుస్తులపై మేము మాట్లాడటం మొదలు పెడితే మీరు పశ్చాత్తాప పడాల్సి వస్తుంది'' అని ఒక ట్వీట్‌లో ఆమె హెచ్చరించారు.


దీనికి ముందు, భారత్ జోడో యాత్రలో ధరల పెరుగుదల అంశాన్ని లేవెనత్తుతున్న రాహుల్ టీ-షర్డ్ ఖరీదెంతో తెలుసా? అంటూ  బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఆయన టీ-షర్ట్ వెల అక్షరాలా 41,257 రూపాయలని సోషల్ మీడియాలో బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ అంతే ధీటుగా తిప్పికొట్టింది. దేశాన్ని ఐక్యంగా ఉంచే ప్రయత్నంలో కాంగ్రెస్ బిజీగా ఉంటే టీ-షర్డ్‌లు, ఖాకీ షర్డ్‌లు లెక్కించడంలో బీజేపీ బిజీగా ఉందంటూ ఎద్దేవా చేసింది. భారత్ జోడో యాత్రకు వస్తున్న అనూహ్య స్పందన చూసి బీజేపీకి భయం పట్టుకుందని, ప్రధాన మంత్రి ధరించే రూ.10 లక్షల దుస్తులు, లక్షా, లక్షన్నర ఉంటే కళ్లద్దాలు (గ్లాసెస్)పై చర్చిద్దామా అని ఎదురు ప్రశ్నించింది. మరోవైపు, రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర శనివారంనాడు మూడో రోజుకు చేరుకుంది. తమిళనాడులోని కన్యాకుమారిలో యాత్ర సాగుతోంది.


Updated Date - 2022-09-10T22:45:38+05:30 IST