Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహోత్సవ విధిః

ది మంది కలిస్తే అది పండగ. వందల మంది కలిస్తే అది జాతర. వందల మంది కలిసినప్పుడు దైవానుగ్రహం పొందటానికి విద్వాంసులు ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తే దానిని ఉత్సవమంటారు. ఈ ఉత్సవాలకు పారమార్థిక లాభాలతో పాటుగా సామాజిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అలాంటి ఈ ఉత్సవాలను ఎలా చేయాలనే విషయాన్ని మన పూర్వీకులు నిర్దేశించారు. ముఖ్యంగా శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఈ ఉత్సవ నిర్వహణకు కచ్చితమైన సంప్రదాయాలు నిర్దేశించారు. కేవలం పండితవర్గాలకు మాత్రమే పరిమితమయిన ఈ సంప్రదాయాలను- శ్రీ పెరుంబుదూరు రాఘవాచార్య- ‘మహోత్సవ విధిః’ పేరిట గ్రంథస్థం చేశారు. శ్రీవైష్ణవ సంప్రదాయాలను తెలుసుకోవాలనుకొనేవారు తప్పనిసరిగా చదవాల్సిన గ్రంథమిది.

Advertisement
Advertisement