Scorpio Classic : అదిరిపోయే లుక్‌లో ‘ మహింద్రా స్కార్పియో క్లాసిక్’.. ఇండియన్ మార్కెట్‌లో ఆవిష్కరణ..

ABN , First Publish Date - 2022-08-13T01:22:22+05:30 IST

‘స్కార్పియో-ఎన్’(Scorpio-N)కు ఆధునిక ఫీచర్లు జతచేసి ‘స్కార్పియో క్లాసిక్’(Scorpio Classic) పేరిట భారత మార్కెట్‌లో పున: ఆవిష్కరించినట్టు దేశీయ వాహన దిగ్గజం మహింద్రా అండ్ మహింద్రా

Scorpio Classic : అదిరిపోయే లుక్‌లో ‘ మహింద్రా స్కార్పియో క్లాసిక్’.. ఇండియన్ మార్కెట్‌లో ఆవిష్కరణ..

న్యూఢిల్లీ : ‘స్కార్పియో-ఎన్’(Scorpio-N)కు ఆధునిక ఫీచర్లు జతచేసి ‘స్కార్పియో క్లాసిక్’(Scorpio Classic) పేరిట భారత మార్కెట్‌లో పున: ఆవిష్కరించినట్టు దేశీయ వాహన దిగ్గజం మహింద్రా అండ్ మహింద్రా( Mahindra and  Mahindra) శుక్రవారం ప్రకటించింది. ఆగస్టు 20 నుంచి విక్రయాలు ఆరంభమవనున్న ఈ కారు 2 వేరియెంట్లతో లభించనుందని తెలిపింది. ఎంట్రీ స్థాయిలో ‘క్లాసిక్ ఎస్‌’.. కాగా మరిన్ని ఫీచర్లతో ‘క్లాసిక్ ఎస్ 11’ గా మార్కెట్లో లభ్యమవనుందని మహింద్రా కంపెనీ తెలిపింది.


ఈ కారు ఆధునిక ఫీచర్ల విషయానికి వస్తే.. ఎక్స్‌యూవీ700, స్కార్పియో-ఎన్ మాదిరిగా ‘ట్విన్-పీక్స్’ ఎస్‌యూవీ లోగోతో కారుని తయారు చేశారు. ఫ్రంట్ గ్రిల్, ఫ్రంట్ బంపర్ కొత్తగా కనిపిస్తున్నాయి. ఇక ఫాగ్ ల్యాంప్ హౌసింగ్స్‌ టాప్ మీద ఎల్ఈడీ డీఆర్ఎల్, డైమండ్-కట్ ఆకృతి కనిపించేలా చక్రాలు ఉన్నాయి. సేఫ్టీ పరంగా చూస్తే మహింద్రా స్కార్పియో క్లాసిక్‌కి 2 ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో ఏబీఎస్, ఫ్రంట్ సీటు బెల్ట్ రిమైండర్ ల్యాంప్, బ్యాక్ పార్కింగ్ సెన్సార్స్, హైస్పీడ్ అలెర్ట్, పానిక్ బ్రేక్ ఇండికేషన్ ఉన్నాయి. ఈ కారు ధర రూ.10 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ఇదిలావుండగా ‘స్కార్పియో క్లాసిక్’తోపాటు స్కార్పియో-ఎన్ విక్రయాలు కూడా మార్కెట్‌లో కొనసాగుతాయని తెలిపింది.

Updated Date - 2022-08-13T01:22:22+05:30 IST