మహిళల భద్రతకు ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-05-19T06:27:41+05:30 IST

మహిళల భద్రతకు ప్రాధాన్యం

మహిళల భద్రతకు ప్రాధాన్యం
జంక్షన్‌ స్టేషన్‌లో సిబ్బంది పనితీరుపై సమీక్షిస్తున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌

హనుమాన్‌జంక్షన్‌, మే 18 : మహిళలకు భద్రత కల్పించటంతో పాటు అవినీతి రహిత పరిపాలనకు  జిల్లా పోలీ్‌సశాఖ పాధ్యాన్యత ఇస్తుందని, అవినీతికి పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహారిస్తామని ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌ అన్నారు. హనుమాన్‌ జంక్షన్‌ పోలీ్‌సస్టేషన్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్‌ కౌంటర్‌ పని తీరుపై  సమీక్షించారు. ఆ సమయంలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితులతో మాట్లాడారు.  పోలీస్‌ ల వ్యవహరశైలిపై ఆరా తీశారు. ఫిర్యాదులు స్వీకరించి త్వరతిగతిన విచారణ చేపట్టాలని ఎస్సై టి. సూర్య శ్రీనివా్‌సను ఆదేశించారు. రిసెప్షన్‌ విధులు నిర్వహి స్తున్న వారు అన్నివేళలా అందుబాటులో ఉండ డంతో పాటు అప్రమత్తంగా ఉంటేనే బాధితులకు సత్వర న్యాయం అందించడానికి వీలవుతుందని సిబ్బందికి సూచిం చారు. అనంతరం సిబ్బందితో ముఖాముఖి మాట్లాడుతూ మహిళల భద్రత విషయంలో పోలీసు లు అప్రమత్తంగా ఉండాలని, ఏ మహిళకు ఆపద వచ్చినా వారికి అండగా ఉండి వారి సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో  కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమెన్‌ ఎస్సై కె.ఉషారాణి, సిబ్బంది ఉన్నారు. 

Updated Date - 2022-05-19T06:27:41+05:30 IST