ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-06-24T04:27:50+05:30 IST

దర్శి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో వివాహిత బుధవారం సాయంత్రం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
లక్ష్మీ మృతదేహం

దర్శి, జూన్‌ 23 : మండలంలోని కొత్తపల్లి గ్రామంలో వివాహిత బుధవారం సాయంత్రం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కఽథనం ప్రకారం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొమరగిరియోగయ్యను మేదరమెట్ల గ్రామానికి చెందిన లక్ష్మీ(22) రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. వారికి నాలుగు నెలల బాబు ఉన్నాడు. బుధవారం సాయంత్రం లక్ష్మీ కొత్తపల్లిలోని ఇంటి వరండాలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దర్శి సీఐ బీమానాయక్‌, ఏఎస్సై సాయిరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-06-24T04:27:50+05:30 IST