మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడాలి

ABN , First Publish Date - 2022-09-28T03:46:52+05:30 IST

మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని బెలూన్‌ థియేటర్‌ ప్రారంభించి మంగళవారం నాటికి 200 రోజులు పూర్తి చేసిన సందర్భంగా గ్రామీణాభివద్ధి శాఖ ఆధ్వర్యంలో థియేట ర్‌లో ఏర్పాటు చేసిన వేడుకలకు అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

- జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 27: మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని బెలూన్‌ థియేటర్‌ ప్రారంభించి మంగళవారం నాటికి 200 రోజులు పూర్తి చేసిన సందర్భంగా గ్రామీణాభివద్ధి శాఖ ఆధ్వర్యంలో థియేట ర్‌లో ఏర్పాటు చేసిన వేడుకలకు అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా మహిళా సమాఖ్య సినిమాటోగ్రఫీ ఆధ్వర్యంలో రూ.50 లక్షల వ్యయంతో 120 మంది కూర్చునే విధంగా జిల్లా కేంద్రంలోని పిక్చర్‌ ట్యూబ్‌ థియేటర్‌ నిర్మించడం అభినం దనీయమని కొనియాడారు. సినిమా హాల్‌ ప్రాంతాన్ని వినోదపు హబ్‌గా రూపొందించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 200 రోజుల్లో 44లక్షల 37వేల రూపాయల ఆదాయం సమకూరిందని తెలిపారు. అనంతరం సినిమా థియేటర్‌లో మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ చిరుధాన్యాలను ప్రాసెస్‌ చేసే ఉత్పత్తి కేంద్రం 15 రోజుల్లో అందు బాటులోకి రావాలన్నారు. వాంకిడిలో నిర్వహిస్తున్న తేనె శుద్ధి కర్మాగారంలో నాణ్యమైన బాటిల్స్‌ వాడాలన్నారు.  జైనూరులో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సూపర్‌మార్కెట్‌, తిర్యాణిలో పేపర్‌ ప్లేట్లు తయారు చేసే విధంగా అధికారులు చూడాలన్నారు. రెబ్బెనలో పచ్చడి తయారు కేంద్రం అభివృద్ధి చేయాలన్నారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ మండలాల్లో చేస్తున్న పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. డీఆర్‌డీవో సురేందర్‌ మాట్లాడుతూ తమ శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో అసిస్టెంట్‌ పీడీ శ్రీనివాస్‌, డీపీవో రామకృష్ణ, ఐకేపీ సిబ్బంది రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-28T03:46:52+05:30 IST