గిరిజన మహిళలపై దాడి ఘటన పై మహిళా కమిషన్ సీరియస్

ABN , First Publish Date - 2022-07-09T20:46:04+05:30 IST

మంచిర్యాల జిల్లా కోయపోషగూడెంలో జరిగిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి విచారణకు ఆదేశించారు.

గిరిజన మహిళలపై దాడి ఘటన పై మహిళా కమిషన్ సీరియస్

హైదరాబాద్: మంచిర్యాల జిల్లా కోయపోషగూడెంలో జరిగిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్(mahila comission) చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి(sunita laxma reddy) విచారణకు ఆదేశించారు. గిరిజన(tribal) మహిళలపై జరిగిన దాడిని చైర్ పర్సన్ ఖండించారు. ఈ ఘటనను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించిందని చైర్ పర్సన్ ప్రకటించారు. ఈ ఘటనపై వెంటనే సమగ్ర విచారణ చేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, రామగుండం సీపీ, మంచిర్యాల డీసీపీలను సునీతా లక్ష్మారెడ్డి ఆదేశించారు. ఆదివాసీ మహిళలకు రాష్ట్ర మహిళా కమిషన్ అండగా ఉంటుందని, వారికి ప్రభుత్వ పక్షాన న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.

Updated Date - 2022-07-09T20:46:04+05:30 IST