తెలంగాణలో మహిళలకు సమాన హక్కులు :mahila comission chairperson

ABN , First Publish Date - 2022-06-02T23:00:04+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలను ప్రత్యేకంగా గౌరవిస్తూ ప్రభుత్వం వారికి సమాన హక్కులు కల్పిస్తోందని తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్(sunita laxma reddy)అన్నారు

తెలంగాణలో మహిళలకు సమాన హక్కులు :mahila comission chairperson

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలను ప్రత్యేకంగా గౌరవిస్తూ ప్రభుత్వం వారికి సమాన హక్కులు కల్పిస్తోందని తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్(sunita laxma reddy)అన్నారు. ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం షి టీమ్స్, భరోసా సెంటర్స్, సఖి సెంటర్స్ ఏర్పాటు చేసిందని తెలిపారు.  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చారని ఆమె గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం సుసంపన్న భవిష్యత్ దిశగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తేున్నట్టు తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహించాలని అన్నారు.


తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తర్వాత రాష్ట్రం సిద్ధించిందన్నారు, అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు.ఈ సందర్భంగాసునీతా లక్ష్మా రెడ్డి జాతీయ పతాకావిష్క‌ర‌ణ చేసి గౌర‌వ వంద‌నం చేశారు.తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌ ఉద్యమంలో అమరులకు నివాళులు అర్పించారు. రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే ఎంతో అభివృద్ధి సాధించిందని, అనేక రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దిక్సూచిగా నిలిచాయని ఆమెతెలిపారు. ఈ కార్యక్రమంలో కమీషన్ సభ్యురాలు షాహిన్ ఆఫ్రొజ్, కమిషన్ సెక్రెటరీ కృష్ణ కుమారి మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-06-02T23:00:04+05:30 IST