మహిళా చట్టాలను పురుషులు కూడా తెలుసుకోవాలి:sunita laxma reddy

ABN , First Publish Date - 2022-05-25T21:31:40+05:30 IST

మహిళా చట్టాలు కేవలం మహిళలే కాదు పురుషులు కూడా తెలుసుకోవాలని, తద్వారా మహిళలకు కల్పించిన హక్కుల పట్ల అవగాహన కలుగుతుందని తెలంగాణమహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి (sunita laxma reddy) అన్నారు

మహిళా చట్టాలను పురుషులు కూడా తెలుసుకోవాలి:sunita laxma reddy

యాదాద్రి భువనగిరిజిల్లా: మహిళా చట్టాలు కేవలం మహిళలే కాదు పురుషులు కూడా తెలుసుకోవాలని, తద్వారా మహిళలకు కల్పించిన హక్కుల పట్ల అవగాహన కలుగుతుందని తెలంగాణమహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి (sunita laxma reddy) అన్నారు.ఆడపిల్లలపై సమాజ ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలని అన్నారు.యాదాద్రీ జిల్లా పర్యటనలో భాగంగా ప్రభుత్వ బాలికల వసతి గృహమును ఆకస్మిక తనిఖీ చేసి బాలికల వసతి సౌకర్యాలను గురించి తెలుసుకున్నారు.అనంతరం జిల్లాలోని సఖి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సఖి నిర్వాహకురాలు లావణ్య ద్వారా సఖి కార్యకలాపాలను అడిగి తెలుసుకొని సఖి కేంద్రం ద్వారా మరిన్ని సేవలందించేందుకు కృషి చేయాలని సూచించారు.


ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ఆడ, మగ బేధాభిప్రాయం చూపిస్తూ పిల్లను పెంచకుడదని, సమాన హక్కులు కల్పిస్తూ పెంచాల్సిన భాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యంగా బాల్య వివాహాలు అరికట్టడం, గృహ హింస, బార్య భర్తల వివాదాలు, యుక్త వయసులో ఎదురయ్యే ప్రేమ తదితర వంటి సమస్యలపై సఖి, ఎంఎస్కే ద్వారా పాఠశాలల్లో మరియు కళాశాలల్లో పిల్లలకు అవగహన కల్పించాలన్నారు. మహిళలు, ఆడపిల్లలు అనీమియా భారిన పడకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరైనా న్యాయం కోసం ఆర్థికంగా అడ్వకేట్ ను నియమించుకోలేని వారికి డీ.ఎల్.ఎస్.ఏ ద్వారా ఉచితంగా న్యాయ సహాయాన్ని, అడ్వకేట్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. 


ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లో @SCWTelangana ద్వారా, ఇమెయిల్ telanganastatewomenscommission@gmail.com, హెల్ప్ లైన్ 181 లేదా కమిషన్ వాట్సప్ నంబర్ 9490555533 ద్వారా కూడా మహిళలకు జరిగే అన్యాయాన్ని కమిషన్ దృష్టికి తీసుకురావచ్చని ఛైర్ పర్సన్ తెలిపారు. అనంతరం మహిళా సమస్యలపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా, కలెక్టరు పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, మహిళా కమిషన్ సభ్యులు షహీన్ అఫ్రోజ్,కుమ్మ ఈశ్వరీబాయి,కొమ్ము ఉమాదేవి, గద్దల పద్మ, సుద్ధం లక్ష్మి,కటారి రేవతి, కమిషన్ సెక్రటరీ కృష్ణ కుమారి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T21:31:40+05:30 IST