ఆస్తి వివాదంతోనే మహేశ్వర్‌రెడ్డి హత్య

ABN , First Publish Date - 2022-10-02T05:09:38+05:30 IST

ఆస్తివిషయంలో వివాదం కారణంగానే కల్లూరు మ హేశ్వర్‌రెడ్డిని హత్య చేశారని పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. హత్య కేసు కు సంబంధించి పులివెందుల పోలీ్‌సస్టేషన్‌లో డీఎస్పీ వెల్లడించిన వివరాల్లోకెళితే....

ఆస్తి వివాదంతోనే మహేశ్వర్‌రెడ్డి హత్య
మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీనివాసులు

వదినే మరిదిని మట్టుబెట్టించింది 

ఇద్దరు నిందితుల అరెస్టు : డీఎస్పీ

పులివెందుల టౌన్‌, అక్టోబరు 1: ఆస్తివిషయంలో వివాదం కారణంగానే కల్లూరు మ హేశ్వర్‌రెడ్డిని హత్య చేశారని పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. హత్య కేసు కు సంబంధించి పులివెందుల పోలీ్‌సస్టేషన్‌లో డీఎస్పీ వెల్లడించిన వివరాల్లోకెళితే....

 వేంపల్లె మండలం చింతలమడుగుపల్లె వా సి కల్లూరు మహేశ్వర్‌రెడ్డి అన్నదమ్ములకు సంబంధించిన భూమి నలుగురు పంచుకో గా స్వాతికి చెందిన ఎకరా భూమిని రూ.3లక్షలకు కొనుగోలు చేసి మహేశ్వర్‌ రెడ్డి అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ఈభూమికి సంబంధించి మహేశ్వర్‌రెడ్డికి తెలియకుండా వదిన స్వాతి ఎకరా భూమికి పాస్‌బుక్కులను త యారు చేయించుకుంది. ఇందుకు రుద్ర శివశంకర్‌రెడ్డి సహకరించారు. ఈ విషయంలో రుద్ర శివశంకర్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి గతంలో గొడవపడ్డారని తెలిపారు. ఈ నేపథ్యంలో  చింతలమడుగుపల్లె నారాయణ హైస్కూల్‌ సమీప ఈదులబావి వద్ద మహేశ్వర్‌రెడ్డి 26వ తేదీన దారుణ హత్యకు గురయ్యా రు

భార్య అమ్మణ్ణి ఆస్తి వివాదం ఉందని, ఈ కారణంగానే భర్తను హత్య చేశారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. విచారణలో భాగం గా గాలిస్తుండగా కుప్పాలపల్లె క్రాస్‌ వద్ద స్వాతి, రుద్ర శివశంకర్‌రెడ్డిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. మిగిలిన వారి పాత్రపై విచారిస్తున్నామని త్వరలోనే హత్య లో పాల్గొన్న అందరినీ అరెస్టు చేస్తామని తెలిపారు. సీఐలు సీతారామిరెడ్డి, బాలమద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-02T05:09:38+05:30 IST