Oct 24 2021 @ 04:06AM

మ్యూజిక్‌ కంపోజింగ్‌ ముగిసింది

మహేష్‌బాబు, కీర్తిసురేష్‌ జంటగా పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్‌ కంపోజింగ్‌ పూర్తయినట్టు తమన్‌ తెలిపారు. ‘సర్కారువారి పాట’ సెట్‌లో మహే్‌షబాబుతో దిగిన ఫొటోను ఆయన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం స్పెయిన్‌లో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. మహేష్‌, కీర్తిపై పాట, ప్రేమ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.