వయసు పెరుగుతున్న కొద్దీ సూపర్ స్టార్ మహేష్ బాబు మరింత యంగ్‌గా తయారవుతున్నాడు. యువకుడి తరహాలోనే స్మార్ట్‌గా, స్లిమ్‌గా కనిపిస్తున్నాడు. అందుకోసం ప్రతిరోజూ జిమ్‌లో చెమటోడుస్తుంటాడు. మహేష్ జిమ్‌కు సంబంధించిన విశేషాలను ఆయన భార్య నమత్ర అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు.
తను జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న వీడియోను మహేష్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో మహేష్ `బాక్స్ జంప్స్` చేశాడు. `మీ ఆటను మరింత పెంచండి. సరిహద్దులు చెరిపేయండి. ఎక్కడా ఆగకండి` అంటూ మహేష్ కామెంట్ చేశాడు. ఈ వీడియో కేవలం 15 నిమిషాల్లో 65 వేలకు పైగా లైక్స్ సంపాదించింది. మహేష్ ఫిట్‌నెస్‌పై ఆయన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.