Abn logo
Jun 6 2020 @ 18:22PM

2020 గ్రాడ్యుయేట్స్‌కు మహేశ్ అభినందనలు

2020 ప్రపంచం ముందు కొత్త సవాళ్ళను నిలబెట్టింది. ఊహించని కరోనా మహమ్మారి కారణంగా వివిధ రంగాలతో పాటు విద్యారంగం అతలాకుతలమైపోయింది. ఈ నేపథ్యంలోనూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని కెరీర్‌లో ముందడుగు వేయబోతున్న విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా అభినందనలు దక్కుతున్నాయి. హాలీవుడ్‌లో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు ఇండియాకూ చేరింది. దేశంలోని వైద్యులు, క్రీడారంగ ప్రముఖులు, సంగీత కళాకారులు న్యూ గ్రాడ్యుయేట్స్‌ను అభినందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ యేడాది కోట్లాదిమంది విద్యార్థులు ఎలాంటి గ్రాడ్యుయేషన్ సెర్మనీస్ లేకుండానే పట్టాలతో విద్యాలయాల నుండి బయటకు రాబోతున్నారు. వీరందరినీ ఆన్‌లైన్ ద్వారానే అభినందిస్తూ, వారిలో సెలబ్రిటీస్ కొత్త ఉత్సాహం నింపుతున్నారు.


బాలీవుడ్ ప్రముఖులు సైతం క్లాస్ ఆఫ్ 2020 గ్రాడ్యుయేట్స్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఎ.ఆర్. రెహ్మాన్, హృతిక్ రోషన్, అలియా భట్‌, అనన్యపాండే, అర్జున్ రాంపాల్, కరణ్ జోహార్ వంటి వారు న్యూ గ్రాడ్యుయేట్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం వీరికి సోషల్ మీడియా ద్వారా విషెస్ అందచేశారు. అత్యంత క్లిష్టసమయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బయటకు వస్తున్న వీరిని అభినందిస్తూ, దేశ భవిష్యత్తులు మీ చేతుల్లోనే ఉందని, మీ వెంట నేనుంటానని మహేశ్ వారికి హామీ ఇవ్వడం విశేషం.
Advertisement
Advertisement
Advertisement