Abn logo
Jun 30 2020 @ 16:55PM

అల్లరోడికి మహేష్ విషెస్!

కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అల్లరి నరేష్ జన్మదినోత్సవం నేడు (మంగళవారం). ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా నరేష్‌కు విషెస్ తెలియజేస్తున్నారు. సూపర్‌స్టార్ మహేష్ కూడా నరేష్‌కు ట్విటర్ ద్వారా బర్త్‌డే విషెస్ తెలియజేశాడు. వీరిద్దరూ `మహర్షి` సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. 


`హ్యాపీ బర్త్‌డే అల్లరి నరేష్. ఈ ఏడాదంతా నీకు అద్భుతంగా ఉండాలి. ఈ ఏడాదంతా నీకు మరింత విజయవంతంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా` అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. మహేష్ ట్వీట్‌కు అల్లరి నరేష్ ధన్యవాదాలు తెలియజేశాడు.  నరేష్ నటించిన `నాంది` టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలై అందరినీ ఆకట్టుకుంది. 



Advertisement
Advertisement
Advertisement