Abn logo
Apr 10 2020 @ 14:20PM

క‌రోనాపై పోరుకు మ‌రో ముంద‌డుగు..?

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారిని అడ్డుకోవ‌డానికి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌లు చ‌ర్య‌ల‌ను తీసుకుంటున్నాయి. ఈ చ‌ర్య‌ల‌కు ప‌లువురు సెల‌బ్రిటీలు త‌మ వంతు మ‌ద్దతుని తెలియ‌జేస్తున్నారు. అంతే కాకుండా విరాళాల‌ను అందించారు...అందిస్తున్నారు. ఇప్ప‌టికే క‌రోనా నివార‌ణా చ‌ర్య‌ల‌కు కోటి రూపాయ‌లు, సినీ కార్మికుల కోసం రూ.25 ల‌క్ష‌లు విరాళం ఇచ్చిన సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌.. ఇప్పుడు క‌రోనాపై పోరుకు మ‌రో అడుగు వేయ‌బోతున్నారంటూ వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. వివ‌రాల మేర‌కు గుంటూరు జిల్లా తెనాలిలోని కొన్ని గ్రామాల‌ను మ‌హేశ్ ద‌త్త‌త తీసుకుంటార‌ని, అందులో భాగంగా స‌ద‌రు గ్రామాల్లో కూలీ దొర‌కకుండా ఇబ్బంది ప‌డుతున్న రోజువారీ కూలీల‌కు డ‌బ్బులు, నిత్యావ‌స‌రాల వ‌స్తువుల‌ను అంద‌జేయాల‌నుకుంటున్నార‌ని టాక్‌. అందుకోసం పార్ల‌మెంట్ స‌భ్యుడు, త‌న బావ గ‌ల్లా జ‌య‌దేవ్ సాయంతో ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారంటున్నారు. మ‌రి ఈ వార్త‌ల‌పై మ‌హేశ్ క్యాంప్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement