టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా మరో చిన్నారికి ప్రాణం పోశారు. దీనితో ఆయన ప్రాణాలు కాపాడిన చిన్నారుల సంఖ్య 1058కి చేరుకుంది. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా మహేశ్ తన సంపాదనలోనుంచి సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న వారికి తన ఆదాయం నుంచి ఆపరేషన్లు చేయించి ప్రాణాలు నిలిపారు. ఇప్పుడు సహస్ర అనే ఏడాది వయసు కలిగిన చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించి ప్రాణాలు నిలిపారు. ఈ విషయాన్ని మహేశ్ సతీమణి నమ్రత తన ఇన్స్టా గ్రామ్ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు ఆమె ఓ పోస్ట్ పెట్టారు. దీంతో మహేష్ అభిమానులు గర్వ పడుతూ, ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ప్రస్తుతం మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' చిత్రంలో నటుస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తుండగా, ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.