Abn logo
Jan 21 2021 @ 15:20PM

దుబాయ్‌కి మహేష్!

సూపర్‌స్టార్ మహేష్ బాబు ఎట్టకేలకు తన తర్వాతి చిత్రం షూటింగ్ ప్రారంభించబోతున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేసేందుకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కరోనా, ఇతర కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ దుబాయ్‌లో ప్రారంభం కాబోతోంది. 


తాజాగా మహేష్ తన కుటుంబంతో కలిసి దుబాయ్ పయనమయ్యాడు. అక్కడ రేపు (శుక్రవారం) తన భార్య జన్మదినోత్సవాన్ని సెలబ్రేట్ చేయనున్నాడు. బర్త్ డే వేడుకల తర్వాత నమత్ర, పిల్లలు హైదరాబాద్ తిరిగి వచ్చేస్తారు. మహేష్ `సర్కారు వారి పాట` షూటింగ్‌కు హాజరవుతాడు. నెల రోజుల పాటు అక్కడే ఈ సినిమా షూటింగ్ జరుగనుంది. ఈ లాంగ్ షెడ్యూల్ తర్వాతే మహేష్ హైదరాబాద్ తిరిగి వస్తాడు. 

Advertisement
Advertisement
Advertisement