Abn logo
Jun 3 2020 @ 14:56PM

`సర్కారు వారి పాట`.. మరో కథ!

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కించబోతున్న చిత్రం `సర్కారు వారి పాట`. టైటిల్‌తోనే ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చేసింది. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్.. సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో మహేష్ ఓ బ్యాంక్ మేనేజర్ కొడుకుగా కనిపించబోతున్నాడని, బ్యాంకుకు టోపీ పెట్టిన బడా బాబు నుంచి తిరిగి డబ్బులు కట్టించే వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నాడని ప్రచారం జరిగింది. 


తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో కథ బయటకు వచ్చింది. ఈ సినిమాలో మహేష్ ఫైనాన్సియర్‌గా కనిపించబోతున్నాడట. అవసరమైన వాళ్లకి అప్పులిచ్చి, తిరిగి కచ్చితంగా వసూలు చేసుకునే వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నాడట. నిజానికి ఈ సినిమాను అమెరికాలో తెరకెక్కించాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే కరోనా కారణంగా అక్కడ షూటింగ్ వీలు కాకాపోవడంతో గోవాను ఎంచుకున్నారట. మహేష్ ఇప్పటివరకు ఇలాంటి పాత్ర చేయలేదు. ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని సమాచారం.  

Advertisement
Advertisement
Advertisement