May 13 2021 @ 14:31PM

ఎన్టీఆర్ 30లో మహేష్ హీరోయిన్..?

ఎన్టీఆర్ 30వ సినిమా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుందనే వార్త ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రీసెంట్‌గా ఎన్టీఆర్ 30వ సినిమాకు సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైన కియారా అద్వానీ మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని ఆ తర్వాత 'వినయ విధేయ రామ' చేసింది. బాలీవుడ్‌లో వరుస సినిమాలలో క్రేజీ హీరోయిన్‌గా మారడంతో తెలుగు సినిమాలు చేయలేనంత బిజీ అయిపోయింది. అయితే టాలీవుడ్‌కు పరిచయం చేసింది కొరటాల శివ కాబట్టి మరోసారి ఆయన దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. కొరటాల ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రాం చరణ్‌లతో 'ఆచార్య' సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే తారక్‌తో సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.