Oct 14 2021 @ 15:23PM

అన్నకి స్వీట్ విషెస్ తెలిపిన తమ్ముడు

సూపర్ స్టార్ మహేశ్ బాబు అన్నయ్య రమేశ్ బాబు.. ప్రస్తుతం బిజినెస్ మ్యాన్ గా సెటిల్ అయ్యారు. అయితే రమేశ్ బాబు మళ్ళీ నిర్మాణ రంగంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అన్నను పెద్ద నిర్మాతగా చూడాలని మహేశ్ బాబు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అంతేకాదు ఆయన మళ్ళీ నిర్మాతైతే.. తను హీరోగా నటిస్తానని మాటకూడా ఇచ్చారు మహేశ్. అలాగే మూతపడిన పద్మాలయ స్టూడియోస్ ను కూడా తిరిగి ప్రారంభించాలని అన్నదమ్ములిద్దరూ ప్రయత్నిస్తున్నారట. 

ఇక నిన్న (బుధవారం) రమేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మహేశ్ బాబు తన అన్నకు అభిమానంగా స్వీట్ విషెస్ తెలిపారు. నన్నెప్పుడూ ఇన్ ఫ్లూయెన్స్ చేసే నా అన్నయ్య రమేశ్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని తెలుపుతూ.. ‘ముగ్గురు కొడుకులు’ సినిమాలోని తండ్రి, అన్న, తను ముగ్గురూ కనిపించే ఫోటో ను షేర్ చేశారు మహేశ్.