Abn logo
Feb 25 2020 @ 13:35PM

ఆపమ్మా.. ఎప్పుడూ అదే పనా: మహేష్ ఫన్నీ టాక్

`ఆపమ్మా ఆపు.. నీకు బోరు కొట్టట్లా.. ఎప్పుడూ ఇదే పనా..` అంటూ మహేష్ చేసిన సరదా వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా విమానాశ్రయంలో తనను ఫొటో తీస్తున్న ఒక అభిమానినుద్దేశించి మహేష్ ఇలా మాట్లాడాడు. 


 మహేశ్‌ కారు దిగి నడిచి వస్తున్నంత సేపు సదరు అభిమాని వరుసగా ఫొటోలు క్లిక్‌మనిపిస్తూనే ఉన్నాడు. అతణ్ని గమనించిన మహేష్ `ఆపమ్మా ఆపు.. నీకు బోరు కొట్టట్లా.. ఎప్పుడూ ఇదే పనా..` అంటూ సరదాగా అన్నాడు. మహేష్ మాటలకు అక్కడున్న వారంతా నవ్వారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. `సరిలేరు నీకెవ్వరు` చిత్రం తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న మహేష్ ప్రస్తుతం తన తర్వాతి సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. 


Advertisement
Advertisement
Advertisement