Oct 28 2021 @ 20:32PM

వామ్మో.. తండ్రికే షాకిచ్చిన Alia Bhatt.. 50 ఏళ్ల మహేశ్ భట్ సంపాదనను రెండేళ్లలోనే దాటేసిన RRR భామ

ఆలియా భట్ బాలీవుడ్‌లో ఎదుగుతున్న తీరుని చూసి ఆమె తండ్రి మహేశ్ భట్ ఎంతగానో సంతోషిస్తున్నారు. తన కూతురిని ఎంతగానో ఆయన మెచ్చుకున్నారు. తను 50ఏళ్లల్లో సంపాదించినంత డబ్బుని తన కూతురు రెండేళ్లల్లోనే సంపాదించిందని చెప్పారు. 


2012లో విడుదలైన స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమా ద్వారా బాలీవుడ్‌లో కెరీర్‌ను ఆరంభించిన నటి ఆలియా భట్. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆమె హవా కొనసాగుతోంది. నిర్మాతలకు, దర్శకులకు మొదటి ఛాయిస్ ఆమెనే.  ఆలియా భట్ తండ్రి మహేశ్ భట్ మాట్లాడుతూ..తన కూతురు తమను మించిపోయిందని తెలిపారు. ఒక మీడియా ఛానల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ..‘‘ తన స్వశక్తితో ఆమె ఎదిగింది. ఫిల్మ్ మేకర్‌గా ఎన్నో ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాను. మా ఇంటిలో చిత్రాల గురించి ఎప్పుడు చర్చలు జరగలేదు. నేను బతుకుదెరువు కోసం చిత్రాలను నిర్మించాను. ఆ విషయాలు అన్ని ఆలియాకు గుర్తుండిపోయాయి ’’ అని మహేశ్ భట్ తెలిపారు.


‘‘ టాలెంట్ ఉంటేనే ఈ ప్రపంచంలో రాణించగలుగుతాం. సినిమాలను నిర్మించే వారి పట్ల నాకు గౌరవం ఉంది. చిన్న వయసులోనే కొందరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. నేను ఆలియాకు పాకెట్ మనీగా రూ.500 మాత్రమే ఇచ్చేవాడిని. కానీ, నేను నిర్మాతగా 50 ఏళ్లల్లో సంపాదించినంతా డబ్బుని నా కూతురు 2 ఏళ్లల్లోనే సంపాదించింది ’’ అని ఆయన చెప్పారు.  

 

ఆలియాభట్ ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న గంగూబాయి కథియవాడి చిత్రంలో నటిస్తోంది. వేశ్యలకు లీడర్‌గా ఆమె ఈ చిత్రంలో కనిపించనుంది. హుస్సేన్ జైదీ రాసిన ‘‘ మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై ’’ అనే పుస్తకం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

Bollywoodమరిన్ని...