మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాక్.. రూ. 12 కోట్లు మాయం

ABN , First Publish Date - 2022-01-25T01:02:32+05:30 IST

మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాక్ అయింది. రూ.12 కోట్లు మాయం అయ్యాయి. మహేష్ బ్యాంక్ మెయిన్ సర్వర్‎ను...

మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాక్.. రూ. 12 కోట్లు మాయం

హైదరాబాద్: మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాక్ అయింది. రూ.12 కోట్లు మాయం అయ్యాయి. మహేష్ బ్యాంక్ మెయిన్ సర్వర్‎ను సైబర్ కేటుగాళ్ళు  హ్యాక్ చేసిన వెంటనే ఆ 12 కోట్లను 100 వేరు వేరు బ్యాంక్ అకౌంట్లకు ట్రాస్ఫర్ చేశారు. దీంతో మహేష్ బ్యాంక్ యాజమాన్యం.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు


ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బ్యాంకుల్లోని డబ్బులు మాయం చేయడంతో పాటు అమాయక ప్రజలను కూడా మోస్తున్నారు. తమకు లోన్ వచ్చిందని, కొంత ఎమౌంట్ జమ చేస్తే పూర్తి డబ్బులు తీసుకోవచ్చని ప్రజలకు ఫోన్ కాల్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎన్ని సూచనలు చేసిన ప్రజలు మాత్రం మోసపోతూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన హైదరాబాద్ నగర వాసులు సైబరాబాద్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కానీ పరిష్కారాలు మాత్రం కావటంలేదు. సైబర్ మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే చాకచక్యంగా బయటపడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 


Updated Date - 2022-01-25T01:02:32+05:30 IST