Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 20 May 2022 09:47:00 IST

Mahesh Babu: నేను డైరెక్టర్ అయితే రీక్రియేట్ చేసే సినిమా ఇదే..

twitter-iconwatsapp-iconfb-icon
Mahesh Babu: నేను డైరెక్టర్ అయితే రీక్రియేట్ చేసే సినిమా ఇదే..

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) తాజాగా పికాక్ మ్యాగజైన్ (ThePeacockMagazine)  కోసం ప్రత్యేకంగా రాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనిలో ఆయన పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు ఒకే ఒక్క పదంలో ఆన్సర్ ఇచ్చారు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తరువాత మహేష్.. సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో కీర్తి సురేష్ (Keerthi Suresh) హీరోయిన్‌గా నటించింది. యంగ్ డైరెక్టర్ పరశురామ్ (Parasuram) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 ప్లస్ రీల్స్ం జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ కలిసి నిర్మించాయి. 

ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో సర్కారు వారి పాట చిత్రాన్ని రూపొందించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధింది. తొలి రోజే మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా మాత్రం అదరగొడుతోంది. ఈ మూవీ సక్సెస్‌తో మహేష్ చాలా హ్యాపీగా ఉన్నారు. ముందునుంచీ ఏదైతే అనుకున్నారో ఆ సక్సెస్ అందుకున్నామని మేకర్స్ కూడా ఉత్సాహంతో చెబుతున్నారు. 

అయితే, తాజాగా ప్రముఖ పికాక్ మ్యాగజైన్ కోసం మహేష్ ప్రత్యేకంగా రాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సొషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వన్ వర్డ్ ఆన్సర్లతో అదరగొట్టారు మహేష్. ఆ విశేషాలపై ఓ లుక్కేదాం..


మీరు ఇష్టపడే నిక్ నేమ్?


నాని


మీరు ఎక్కువగా దేనికి భయపడతారు?


నా దర్శకుడి అంచనాలను ఎక్కడ అందుకోలేకపోతానా అని భయపడుతుంటాను.


మీలో దాగివున్న హిడెన్ టాలెంట్‌ను ఇంట్లో వాళ్ల ముందు ప్రదర్శిస్తారా?


నేను ఇంట్లో చాలా ఫన్నీ పర్సన్‌ని. అదే నాలో ఉన్న హిడెన్ టాలెంట్. ఆ విషయాన్ని నా వైఫ్, నా పిల్లలు మాత్రమే చూస్తారు.


మీరు చేసిన అత్యంత సాహసోపేతమైన పని?


న్యూజీలాండ్‌లో బంగీ జంపింగ్.


మీరు తరచుగా ఉపయోగించే పదం?


'బ్యూటిఫుల్' అనే పదాన్ని ఎక్కువగా వాడుతుంటాను.


మిమ్మల్ని ఏడిపించిన చివరి సినిమా?


లయన్ కింగ్.


మీరే దర్శకుడైతే మీ సినిమాల్లో ఏ చిత్రాన్ని మళ్లీ రీ క్రియేట్ చేయాలనుకుంటున్నారు?


'ఒక్కడు'.


మీ ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీ ?


మా నాన్న నటించిన 'అల్లూరి సీతారామరాజు' సినిమా నా ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీ.


మీరు తిన్న వింతైన ఫుడ్ ?.


సీఫుడ్ అనుకుంటా సరిగ్గా గుర్తు లేదు. అలాంటివి తినడం నాకు అస్సలు ఇష్టం ఉండదు.


ఫ్యామిలీతో కలిసివెళ్లి డిన్నర్ చేయాలనుకునే ఫేవరేట్ రెస్టారెంట్?


హైదరాబాద్‌లో అయితే ఐటీసీలో వున్న దక్షిణ్ రెస్టారెంట్ అంటే ఎక్కువగా ఇష్టపడతాను. అక్కడ దొరికే సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. విదేశాలలో అయితే 'నోబూత్' నా ఫేవరేట్ ప్లేస్.


మీరు ఒక పడవని తీసుకువస్తే దాన్ని ఏమని పిలుస్తారు?


ముందు వీటిని అసలే ఇష్టపడను. సిక్ అయిపోతాను. అసలు హ్యాండిల్ చేయలేను.


మీరు రెస్ట్ ఎలా తీసుకుంటారు?


ఫ్యామిలీతో కలిసి హాలీడేస్‌కి వెళ్లిపోతాను. అలా నేను రెస్ట్ తీసుకుంటాను. దాని వల్లే నా స్ట్రెస్‌ని పోగొట్టుకుంటాను.  


మీరు కోరుకున్నది నిజమైతే పశ్చాత్తాపపడినది ఏమిటి?


ఇప్పటివరకు ప్రతిదీ అందంగా ఉంది. రిగ్రేట్స్ అంటూ ఏమీ లేవు.


విహారయాత్రలో ఏ పని చేయడానికి ఇష్టపడతారు?


నచ్చిన ఫుడ్ తినడమే.


జీవితంలో మీరు ఎవరిలా మారాలనుకుంటున్నారు? 

నా కూతురు.

అంటూ రాపిడ్ ఫైర్ ఇంటర్య్వూని ముగించారు సూపర్ స్టార్. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International