Abn logo
May 30 2020 @ 23:43PM

రాజమౌళితో చేసే సినిమా గురించి మహేష్ ఏం చెబుతాడో..

ఎప్పుడూ లేనిది మహేష్ బాబు ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను ఎంతో సంతోష పెడుతున్నారు. సినిమా అప్‌డేట్ విషయంలో ఆలస్యం అయినప్పటికీ.. మహేష్ ట్వీట్స్‌తో అభిమానులకు ఆ ఫీలింగ్ రానివ్వలేదు. ఇక మహేష్ బాబు తన తండ్రి బర్త్‌డేను పురస్కరించుకుని డైరెక్ట్‌గా అభిమానులతో ముచ్చటించేందుకు సిద్ధమవుతున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆయన తన ఇన్‌స్టాగ్రమ్‌లో లైవ్‌లో అభిమానులతో ముచ్చటించనున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఆయన అభిమానులు ఎప్పుడెప్పుడు 5 అవుతుందా? అని ఎదురుచూస్తున్నారు. 


అంతేకాదు? మహేష్ బాబును అడగాలనుకుంటున్న ప్రశ్నలన్నింటినీ వాళ్లు ఇప్పటికే ప్రిపేర్ అయి ఉన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అందులో ఎక్కువ మంది అభిమానులు మహేష్ మరియు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమా గురించే ప్రశ్నలు అడిగేందుకు ప్లానింగ్ చేసుకుంటున్నారు. మరి అభిమానులు అడిగే ప్రశ్నలకు మహేష్ ఏ విధంగా సమాధానం ఇస్తాడో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదు.

Advertisement
Advertisement
Advertisement