Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

సినిమా ఫ్లాప్ అయితే నాదే బాధ్యత

twitter-iconwatsapp-iconfb-icon
సినిమా ఫ్లాప్ అయితే నాదే బాధ్యత

కథల్ని సరిగా జడ్జ్ చేయకపోవడం వల్లే ఫ్లాపులు

‘పనన్ కళ్యాణ్‌ గారితో నటిస్తా’

90ఏళ్లు వచ్చినా నటించాలన్నదే యాంబిషన్

అల్లూరి సీతారామరాజు లాంటి సినిమా తీయాలి

కథ విన్న రోజే నమ్రతతో ‘చాలా మంచి కథ విన్నా’ అని చెప్పా 

25-8-2015న ఓపెన్ హార్ట్‌ విత్ ఆర్కేలో మహేశ్ బాబు


ఆర్కే: మీరు అందంగా ఉండటం వల్ల జనం మీద పడిపోతుంటారు కదా. మీకు ఇబ్బంది అనిపిస్తుందా?

మహేష్‌ బాబు: అదేం లేదు. ఆనందంగా ఉంటుంది. నా అందాన్ని జనాలు పొగుడుతున్నప్పుడు ఐ ఫీల్‌ వెరీ గుడ్‌. ఐ ఫీల్‌ థ్యాంక్‌ఫుల్‌ టు మై పేరెంట్స్‌. కాలేజీ రోజుల్లో పరిస్థితి వేరుగా ఉండేది. అప్పట్లో నేను లావుగా ఉండేవాడ్ని. ఎవరితో మాట్లాడేవాడిని కాదు. ఐదుగురు స్నేహితులు మాత్రమే ఉండేవారు. క్రికెట్‌ ఆడటం ఇష్టం. సినిమాలు బాగా చూసేవాడిని.


ఆర్కే: చదువుకునే రోజుల్లో మీ నాన్న బిజీ స్టార్‌ కదా.. మీతో తరచుగా మాట్లాడేవారా?

మహేష్‌: అంత బిజీ స్టార్‌ అయినా ప్రతిరోజూ మాకోసం కొంచెం సమయాన్ని కేటాయించేవారు. ఉదయం మాతో మాట్లాడేవారు, రాత్రి డిన్నర్‌ చేసేవారు. మా వరకూ ఆయన మా నాన్న. మా నాన్నలాగే నేనూ నా పిల్లలతో ఉండటానికి ప్రయత్నిస్తున్నాను.


ఆర్కే: మీ భాషలో గ్రామీణ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకు?

మహేష్‌: మా అమ్మమ్మ పెంపకంవల్ల భాష అలా వచ్చింది. ఇంట్లో పిల్లలందరం తెలుగు బాగా మాట్లాడేవాళ్లం.


ఆర్కే: క్రికెట్‌ కాకుండా ఇంకా ఏయే పాటు ఇష్టాలుండేవి?

మహేష్‌: క్రికెట్‌ కాకుండా చెప్పాలంటే సినిమాలు విపరీతంగా చూసేవాడ్ని. అదీ ఫస్ట్‌ షోనే. తమిళం, హిందీ సినిమాలు చూడడం ఎక్కువ. తమిళం బాగా మాట్లాడతా. సినిమా నచ్చిందంటే రెండు, మూడు సార్లు చూడాల్సిందే. ఇప్పటికి కూడా థియేటర్‌కి వెళ్లి సినిమా చూడటం చాలా ఇష్టం. దుబాయ్‌, సింగపూర్‌ వెళ్లినప్పుడు అక్కడి థియేటర్‌లలో సినిమాలు చూస్తాను.


ఆర్కే: ట్రావెలింగ్‌ అంటే ఇష్టమా?

మహేష్‌: పిల్లలకు సెలవులు ఉన్నప్పుడు టూర్స్‌ ప్లాన్‌ చేస్తాను. సంవత్సరంలో కనీసం ఆరు సార్లు ఫ్యామిలీతో కలిసి టూర్‌ వెళ్తాను.


ఆర్కే: మీ భార్య నమ్రత దగ్గర్నించి కంప్లయింట్స్‌ ఏమైనా ఉన్నాయా?

మహేష్‌: ఉయ్‌ ఆర్‌ బియాండ్‌ ఆల్‌ దట్‌. పిల్లలు పెరుగుతున్నారు. వాళ్లని చూసుకోవడం పెద్ద బాధ్యత. ఆనందంగా ఉన్న సమయంలో కంప్లయింట్స్‌ ఉండవు. సో.. మేం చాలా హ్యాపీ. చిన్నచిన్నవి ఉంటాయి. అవికూడా లేకపోతే లైఫ్‌ మొనాటనీ అవుతుంది.


ఆర్కే: బాల్యంలో కొంటె పనులేమైనా చేశారా?

మహేష్‌: ఒకట్రెండు సార్లు స్కూల్‌ ఎగ్గొట్టి సినిమా చూశాను. ఆ విషయం ఇంట్లో తెలిసింది. దానికి మించి ఏమీ జరగలేదు.


ఆర్కే: శ్రీమంతుడి ఇంట్లో పుట్టిన మీకు ‘శ్రీమంతుడు’ సినిమా చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది?

మహేష్‌: కొరటాల శివగారు కథ చెప్పినపుడే ఆ క్యారెక్టర్‌కు రిలేట్‌ అయ్యాను. హీరో శ్రీమంతుడైనా సింపుల్‌గా ఉంటాడు. ఓ చిన్న కారు ఉంటుంది. సైకిల్‌ వేసుకుని తిరుగుతాడు. నేను కూడా బయట అలాగే ఉంటాను.


ఆర్కే: స్టార్‌డమ్‌ ఉన్నవాళ్లు సందేశాత్మక సినిమాలు చేసేందుకు భయపడతారు. మీకు రిస్క్‌ అనిపించలేదా?

మహేష్‌: కథ విన్నపుడు నాకైతే రిస్క్‌ అనిపించలేదు. మెసేజ్‌ ఓరియెంటెడ్‌ అనే ఆలోచనతో కథ వినలేదు.. కథను కథలా విన్నాను. అందులో మంచి ఫ్యామిలీరిలేషన్స్‌, లవ్‌ ట్రాక్‌, పెద్ద మాస్‌ బ్యాక్‌డ్రాప్‌.. ఉంది. ఇంతటి కమర్షియల్‌ ప్యాకేజ్‌ ఒక స్టార్‌కు దొరకటం చాలా అరుదు. కథ విన్న రోజు నమ్రతతో ‘చాలా మంచి కథ విన్నాన’ని చెప్పాను. నా కెరీర్‌లో మంచి సినిమా అవుతుందని భావించా. సినిమా చేసేటపుడు, షూటింగ్‌ పూర్తయ్యాక కూడా అదే నమ్మకంతో ఉన్నాం.


ఆర్కే: సినిమా కథల ఎంపిక విషయంలో మీ భార్య ఇన్వాల్వ్‌మెంట్‌ ఉంటుందా?

మహేష్‌: అస్సలు ఉండదు. నేనొక్కడినే కథ వింటాను. నేనే డిసైడ్‌ చేస్తాను. కెరీర్‌ ప్రారంభం నుండీ అంతే. మా నాన్నగారితో కూడా కథల గురించి డిస్కస్‌ చేయలేదు. తొలి సినిమా నుంచి నా నిర్ణయమే. సినిమాలు ఆడకపోతే పొరపాట్లు తెలుసుకుని నేర్చుకుంటాను. ఇట్స్‌ ఫిఫ్టీన్‌ ఇయర్స్‌ జర్నీ. ఈ జర్నీలో ఎంతో కొంత నేర్చుకుని, నాలెడ్జ్‌ సంపాదించానని నమ్మకం.

ఆర్కే: మరి విమర్శ ?

మహేష్‌: నా సినిమా ఆడకపోతే నాన్నే క్రిటిక్‌. సినిమా చూసొచ్చి ‘ఈ సినిమా ఆడితే మహేష్‌ స్టార్‌ కాదు.. ఈ సినిమా ఫ్లాప్‌ అయితే మహేష్‌ స్టార్‌’ అన్నారాయన. స్టార్స్‌ ఏవి పడితే అవి చేయకూడదు.


ఆర్కే: మీ నాన్న భోళాశంకరుడు. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌. మీరు క్వైట్‌ ఆపోజిట్‌, క్యాలిక్యులేటెడ్‌... ఈ లక్షణం మీకెలా వచ్చింది?

మహేష్‌: కెరీర్‌ బిగినింగ్‌ నుంచీ నేనంతే. దెబ్బలు తగలొచ్చు. తగిలినపుడు పాఠం నేర్చుకోవాలి. ఇది నా అప్రోచ్‌. సినిమా ఒత్తిడులు ఇంటికి తీసుకురాకూడదనేది ఆయన నుంచి నేర్చుక్నుదే. ఆయనకు విపరీతమైన మంచితనం ఉంది. ‘నో’ చెప్పటం తెలీదు. ఆ ప్రాసెస్‌లో రాంగ్‌ సినిమాలు చేశారు. నా పదహారేళ్ల వయసులో గమనించినవన్నీ మైండ్‌లో ఉండిపోయాయి. ఆయన్ని చూసి మంచి, చెడు నేర్చుకున్నాను. కానీ అంత మంచితనం వద్దనుకున్నానంతే (నవ్వులు).


ఆర్కే: సినిమాల్లోకి రావాలని ఎప్పుడనిపించింది?

మహేష్‌: ఆ విషయం నాన్నగారే డిసైడ్‌ చేశారు. ఐ హ్యావ్‌ టు బ్లెస్డ్‌ దిస్‌ డిజైన్‌. చిన్నప్పుడు సినిమాలు చేయించేవారు. వేసవి సెలవుల్లో ఊటీకి వెళ్లి సినిమా చేసేవాడిని. అలా ఆరేళ్ల పాటు ఆరు సినిమాలు చేశాను. అవి బాగానే ఆడాయి. యాక్ట్‌ చేయమంటే చేశాను. ఒక సినిమా షూటింగ్‌ మాత్రం జూన్‌, జూలై దాకా వెళ్లింది. దానివల్ల స్కూల్లో ఒక సంవత్సరం వేస్ట్‌ అయిపోయింది. అప్పుడు ‘సినిమాల్లో వద్దు. చదువు పూర్తయ్యాక హీరోగా చేద్దువులే’ అన్నారు. అలాగే చదువైన వెంటనే సినిమాలు చేశాను. అంతేగాని ఎలాంటి శిక్షణా తీసుకోలేదు.


ఆర్కే: పదిహేనేళ్లలో రెండు, మూడు డిజాస్టర్స్‌ ఉన్నాయి. మీకేమనిపించింది?

మహేష్‌: ఆ కథల్ని సరిగా జడ్జ్‌ చేయలేకపోవటం వల్లే ఫ్లాప్‌ అయ్యాయి. సినిమా ఫ్లాప్‌ అయితే నేనే రెస్పాన్సిబుల్‌. హిట్‌ అయితే అందరూ రెస్పాన్సిబుల్‌. ఫ్లాప్స్‌ వచ్చినపుడు చాలా బాధపడ్డాను. ఇంట్లోంచి బయటకు రాలేదు. ఈ ట్రావెల్‌లో నా మిస్టేక్‌ను అనలైజ్‌ చేసుకోవటం మంచిదే. అలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కోవాలి. ఎస్కేప్‌ చేస్తే అది మనల్ని మళ్లీ వెంటాడుతుంది.


ఆర్కే: ‘శ్రీమంతుడు’తో గ్రామాల్ని దత్తత తీసుకోవాలనేది ఓ మూవ్‌మెంట్‌లాగా వస్తోంది. మీరెలా ఫీలవుతున్నారు?

మహేష్‌: సినిమా చేసేటపుడు పవర్‌ఫుల్‌ పాయింట్‌ అని తెలుసు. అయితే ఈ సినిమా వల్ల ఇంత ఇంపాక్ట్‌ ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ సినిమాతో నాకు సోషల్‌ రెస్పాన్సిబిలిటీ వచ్చింది. ఓ క్యారెక్టర్‌తో ఏడునెలలు ట్రావెల్‌ అయితే ఎంతో కొంత మారతాం. ‘ఈ సినిమా ప్రభావంతో కొందరు యంగ్‌స్టర్స్‌ గ్రామాల్ని దత్తత తీసుకుంటున్నాం’ అంటుంటే ఎంతో తృప్తిగా అనిపించింది.


ఆర్కే: మహేష్‌బాబుగా ఈ మూవ్‌మెంట్‌ను ముందుకు తీసుకుపోవటానికి ప్లాన్‌ చేస్తున్నారా?

మహేష్‌: శ్రీమంతుడు సినిమా షూటింగ్‌ ప్రారంభమైన మూడు నెలల తర్వాత మా బావ జయదేవ్‌ వచ్చి మన ‘బుర్రిపాలెం’ గ్రామాన్ని దత్తత చేసుకుంటే బావుంటుంది అన్నారు. ‘నేను చేసే సినిమా కథ అలాంటిదే’ అన్నాను. ఆయన షాక్‌ అయ్యారు. అప్పుడే చేస్తే సినిమా పబ్లిసిటీ కోసం అంటారేమోనని సినిమా రిలీజ్‌ అయ్యాక ఆ పని చేద్దాం అన్నాను.


ఆర్కే: మీ ఊరికోసం ఎంత బడ్జెట్‌ కేటాయించారు?

మహేష్‌: డబ్బులని లెక్క కాదు. సమాజం నుంచి తీసుకున్నాం. సమాజానికి ఏదైనా ఇవ్వాలనుకున్నానంతే. ఇదో బాధ్యత. నా అభిమానులతో పాటు మిగతా వారు కూడా ఇన్‌స్పైర్‌ అయ్యారు. రాబోయే రోజుల్లో ఈ మూవ్‌మెంట్‌ను ఇలాగే ముందుకు తీసుకెళతాను.


ఆర్కే: మీరు కాంట్రవర్సీల జోలికి వెళ్లరు. వేరే హీరోలకు కూడా వాయిస్‌ ఇస్తుంటారు. వారితో ఫ్రెండ్లీగా ఉంటారా?

మహేష్‌: అవును. వేరే హీరోలకు వాయిస్‌ ఇస్తే తప్పేంటి అనేది నా ఫీలింగ్‌. దర్శకులు త్రివిక్రమ్‌, శ్రీనువైట్ల నా ఫ్రెండ్స్‌. వారి సినిమాలకోసం అడిగినపుడు అంగీకరించాను. మల్టీస్టారర్‌ కథలకూ ముందుంటాను. వాటిలో నటిస్తే ప్రేక్షకులకూ కొత్తగా ఉంటుంది. అందుకే ఇలాంటివి ఎంకరేజ్‌ చేస్తాను. ఎందుకంటే ఇండస్ట్రీ  ఇంతకు ముందులా లేదు. ఎవరి ప్లేస్‌ వారికి ఉంది. ట్విట్టర్‌ ఇంటరాక్షన్‌లో ఎవరో అడిగితే ‘పవన్‌ కళ్యాణ్‌ గారితో నటిస్తా’ అన్నాను. దాన్నే అందరూ రాస్తున్నారు.

ఆర్కే: మీ డైలాగ్‌ వింటుంటే ఇంట్లోవాళ్లు చెబుతున్నట్లుంటుంది. ఈ లక్షణం ఎలా వచ్చింది?

మహేష్‌: స్వతహాగానే. లక్కీగా నాన్నగారి మెమొరీ వచ్చింది. దర్శకుడో, సహాయ దర్శకుడో డైలాగ్‌ చెప్పినపుడు విని చెబుతాను. అదే చదివి చెబితే మాడ్యులేషన్‌ ఫిక్స్‌ చేసుకుంటాం. గ్రాస్ప్‌ చేసి డైలాగ్‌ చెప్పటం వల్లే న్యాచురల్‌ మాడ్యులేషన్‌ వస్తుందేమో. అందుకే సెట్‌ మాడ్యులేషన్‌ ఉండదు. ఎలా డైలాగ్‌ వస్తుందో నాకే తెలీదు.


ఆర్కే: హిందీ చిత్రాల్లో ఎందుకు నటించలేదు?

మహేష్‌: తెలుగులోనే మంచి సినిమాలు చేయాలి. గొప్ప సినిమాలు చేయాలి. అవి చూసి వేరే వాళ్లు చెప్పుకోవాలి. అలాంటి స్థాయికి వెళ్లటానికి మనకు స్కోప్‌ ఉంది. నా డ్రీమ్‌ రాజమౌళి బాహుబలి ద్వారా నెరవేరింది. మన ఇండసీ్ట్రలోనే ఇంప్రూవ్‌ కావాలని ఉంది. ఇది వదిలేసి హిందీలో చేసేద్దాం అనే కోరిక నాకు లేదు.


ఆర్కే: పెద్దగా మాట్లాడని మీరు లవ్‌ దాకా ఎలా వెళ్లారు?

మహేష్‌: (నవ్వులు) ఇట్స్‌ హ్యాపెన్‌. అంతే. తనతో కనెక్ట్‌ అయ్యాక నాలుగైదేళ్లు మ్యూచువల్‌ జర్నీలో చాలా దగ్గరయ్యాం. మా నాన్నగారు ‘ఆర్‌ యు ష్యూర్‌’ అని అడిగారు. నేను ‘యస్‌..’ అన్నాను. ఆయన ‘ప్రొసీడ్‌’ అన్నారు.

ఆర్కే: మీ స్ట్రాంగ్ పాయింట్‌ ఏంటి?

మహేష్‌: క్రమశిక్షణ నా బలం. షూటింగ్‌కి కరెక్ట్‌ సమయానికి హాజరవుతాను. షూటింగ్‌ పూర్తవ్వగానే ఇంటికి వెళ్తాను. ఇంట్లో కామ్‌గా గడపడమే నా బలం. నమ్రత నా బెస్ట్‌ ఫ్రెండ్‌. గౌతమ్‌కి తొమ్మిదేళ్లు. సితారకు మూడేళ్లు. వాళ్లతో ఆడుకోవటం చాలా ఇష్టం. గౌతమ్‌ స్కూల్‌కు వెళ్లకుండా ఎగ్గొట్టేందుకు నా నెక్ట్స్‌ సినిమాలో యాక్ట్‌ చేస్తాను అంటుంటాడు. ‘శ్రీమంతుడు’ చిత్రం చూశాక రియలిస్టిక్‌ ఫిల్మ్‌ అంటూ పెద్ద మాటలు మాట్లాడేస్తున్నాడు. ఇంతకుముందు చేసిన వాటికంటే ‘శ్రీమంతుడు’ కొత్తగా ఉందంటూ ఈ సినిమాను మూడుసార్లు చూశాడు. గౌతమ్‌ మాటలు వింటుంటే నాకే కొత్తగా ఉంటుంది. గౌతమ్‌కు యాక్షన్‌ నచ్చదు. ‘వన్‌’ లో ఫైటింగ్‌ ఎక్కువని చూడలేదు. ‘సీతమ్మ వాకిట్లో..’ తర్వాత ‘శ్రీమంతుడు’ చూశాడు.


ఆర్కే: మీ ద్వారా గొప్ప చిత్రాలు రావాలన్నారు.. ‘బాహుబలి’ లాంటి సినిమా రికార్డులను దాటాలనే ఆశ ఉందా?

మహేష్‌: దాన్ని దాటలనేది చాలా చిన్న మాట. ఇట్స్‌ నాట్‌ ఎ గుడ్‌ వర్డ్‌. ఫస్ట్‌ ‘బాహుబలి’ తెలుగు సినిమా అయినందుకు గర్వంగా ఫీల్‌ అవ్వాలి. నా కెరీర్‌లో అలాంటి సినిమా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ప్యాషన్‌తో సినిమా చేస్తే గొప్ప మార్కెట్‌ ఉంటుందని ప్రూవ్‌ చేశారు. రాజమౌళితో కలిసి పనిచేయాలని నాలుగేళ్ల క్రితమే అనుకున్నా. రాజమౌళి దర్శకత్వంలో సినిమా ఓకే అయ్యింది. దానికి కె.ఎల్‌. నారాయణ ప్రొడ్యూసర్‌.


ఆర్కే: ఏ సినిమా అయినా ఇంకా బెటర్‌గా చేయాల్సిందని అనుకున్నారా?

మహేష్‌: ప్రతీ సినిమా చూశాక ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. నటులకి అలా అనిపించడం మంచి లక్షణం. నాకు 90 ఏళ్లు వచ్చాక కూడా నటించాలనేదే నా యాంబిషన్‌. ‘మురారి’ సినిమాను సుదర్శన్‌ 35 ఎం.ఎం.లో చూశాను. సినిమా అయిపోయాక టైటిల్స్‌ పడుతున్నప్పుడు నాన్న నా భుజం మీద చేయి వేశారంతే ఆయన ఏమీ మాట్లాడలేదు. చాలా హ్యాపీగా ఫీలయ్యాను.


ఆర్కే: మీ అందం, ఫిజిక్‌ మెయింటెనెన్స్‌ సీక్రెట్‌ ఏంటి ?

మహేష్‌: అదేంటో నాకూ తెలీదు. హెల్దీ లైఫ్‌స్టైల్‌. నాన్నగారిలాగే నాకూ ఓ అలవాటు ఉంది. ఎప్పుడూ నవ్వుతుంటాను. షూటింగ్‌ టైంలో కార్బోహైడ్రేట్‌ మీల్స్‌ రోజుకు ఆరేడుసార్లు తక్కువ మోతాదులో మూడుగంటలకోసారి తీసుకుంటాను. అయితే ఎక్సర్‌సైజ్‌లాగా డైట్‌ మెజర్డ్‌గా ఉంటుంది. నాకు ఫుడ్‌ అంటే చాలా ఇష్టం. త్వరగా బరువు పెరిగే శరీరం గుణం నాది. హాలిడేస్‌ టైంలో రెండు మూడు కేజీలు పెరుగుతుంటా. వెంటనే డైట్‌ పాటించి కొవ్వును కరిగించేస్తుంటా. ఈ పదిహేనేళ్లలో ఇపుడున్నంత ఫిట్‌గా నేను ఎప్పుడూ లేను.


ఆర్కే: మిమ్మల్ని ఎవరైనా ఎత్తుకుపోతారని మీ ఆవిడ జెలసీగా ఫీల్‌ కాలేదా?

మహేష్‌: అస్సలు లేదు. ఏ రోజూ అలాంటి డిష్కన్‌ రాలేదు. నేనేంటో తనకు తెలుసు.. అందుకే ఇలాంటి సిల్లీ డౌట్స్‌ తనకు రావు. మన బిహేవియర్‌ను బట్టే ఇతరులుంటారు. నేను ప్యూర్‌ హార్డ్‌వర్క్‌, డెడికేషన్‌తో సెట్స్‌లో ఉంటాను. ముందునుంచీ నేను ఇలాగే ఉన్నాను. సినిమాలో పనిచేయటం చాలా కష్టం అని ఫీలింగ్‌. అక్కడ కష్టపడి ఇంటికొస్తే ఆనందంగా ఉండాలి.


ఆర్కే: మీరు ‘శ్రీమంతుడు’ సినిమాకు ముందునుంచే హార్డ్‌వర్క్‌ చేశారా?

మహేష్‌: ఈ సినిమా ప్రమోషన్‌ చాలా బాగా చేశారన్నారు. ఎందుకంటే కంటెంట్‌పై నమ్మకాన్ని పోస్టర్స్‌, ట్రైలర్స్‌లో చూపించాం. అందుకనే ఆడియన్స్‌ ఫస్ట్‌ షో చూశాక సర్‌ప్రైజ్‌ కాలేదు. ఇమ్మీడియేట్‌గా యాక్సెప్ట్‌ చేశారు. ప్రమోషన్స్‌ చాలా ఇంపార్టెంట్‌. కొద్దిగా తెలుగు సినిమా మారింది. పబ్లిసిటీ విషయంలో హిందీ స్టార్స్‌ ముందే రియలైజ్‌ అయ్యారు. మనం ఇపుడిపుడే రియలైజ్‌ అవుతున్నాం. ఇది ప్రొడ్యూసర్స్‌కు, ఇండస్ర్టీకి మంచిది. హీరో ప్రమోషన్‌ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇకముందూ ఇలాగే ప్రమోషన్‌ చేస్తాను.


ఆర్కే: నాన్నగారు తీసిన ‘అల్లూరి సీతారామరాజు’ లాంటి గొప్ప సినిమా చేయాలనుకుంటున్నారా?

మహేష్‌: ఆ సినిమా నా ఫేవరేట్‌ చిత్రం. 50 సార్లు చూశాను. అంత గొప్ప సినిమాను రీమేక్‌ చేసి చెడగొట్టే ఇష్టం లేదు. క్లాసిక్‌ క్లాసిక్‌గానే ఉండాలి. అలాంటివన్నీ మనం అనుకుంటే జరగవు. కొన్ని జరుగుతాయంతే. మా నాన్న అలాంటి గొప్ప ప్రాజెక్ట్‌ చేసినందుకు చాలా గర్వంగా ఉంది. నేను నా క్యాపబిలిటీస్‌, సెన్సిబిలిటీస్‌ బట్టి చేస్తా. పేరొస్తే ఆనందం.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

సినీ ప్రముఖులుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.