Abn logo
Mar 26 2020 @ 17:14PM

భారీ విరాళం ప్రకటించిన మహేష్ బాబు

క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు ఇప్పుడు అన్నీ దేశాలు, రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నంలో దేశాల, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ పడిపోతుంది. ఇలాంటి సమయంలోనే ప్రభుత్వాలకు బాసటగా నిలవాలని కొందరు ముందుకు వస్తుండటం విశేషం. ఈ విషయంలో టాలీవుడ్ ఓ అడుగు ముందే ఉంది. ఈ విషయం అనే కాదు, ఎప్పుడు.. ఎటువంటి ఉపద్రవం వచ్చినా ఆదుకునే విషయంలో టాలీవుడ్ ముందు వరుసలో ఉంటుంది. ఈ కరోనా విషయంలో ప్ర‌భుత్వాలు చేస్తున్న కృషికి త‌మ వంతుగా తోడ్పాటునందించేందుకు టాలీవుడ్ ప్ర‌ముఖులంతా ముందుకొస్తున్నారు. ఇప్ప‌టికే చిరంజీవి, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, రామ్‌చ‌ర‌ణ్, నితిన్‌, త్రివిక్ర‌మ్‌, దిల్ రాజు వంటి ప్రముఖులెందరో తమ వంతు సహాయం ప్రకటించారు. భారీ విరాళం ప్రకటించి ఇప్పుడీ లిస్ట్‌లోకి తాజాగా మ‌హేష్‌బాబు కూడా చేరారు. ఆయన రూ. కోటి రూపాయ‌ల విరాళాన్ని ప్రకటించారు. 


‘‘క‌రోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్ర‌భుత్వాలు చ‌క్క‌టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ పోరాటంలో నా వంతు భాగ‌స్వామ్యంగా తెలంగాణ‌ ముఖ్యమంత్రి సహాయనిధికి, అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి స‌హాయ‌నిధికి కలిపి రూ. కోటి రూపాయ‌ల్ని విరాళంగా ఇస్తున్నాను. బాధ్య‌తాయుత‌మైన పౌరులుగా ప్ర‌తి ఒక్క‌రూ లాక్‌డౌన్‌కు స‌హ‌క‌రించి నియ‌మ‌ నిబంధనలను పాటించండి. ఇంటిలోనే ఉండి.. సురక్షితంగా ఉండండి..’’ అని మ‌హేష్‌బాబు తన ట్వీట్‌లో తెలిపారు.


Advertisement
Advertisement
Advertisement