Abn logo
Aug 2 2020 @ 12:54PM

దేవిశ్రీ ప్రసాద్‌కు మ‌హేశ్‌, బ‌న్నీ బ‌ర్త్ డే విషెష్‌

రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్‌.. యువ సంగీత కెర‌టం. చిన్న వ‌యసులో సినీ రంగ ప్ర‌వేశం చేశారు. 21 ఏళ్ల సుదీర్ఘ ప్ర‌యాణం. చిర‌స్మ‌ర‌ణీయ‌మైన‌, సుస్వ‌ర‌ణీయ‌మైన బాణీల‌ను అందించ‌గ‌ల ఈ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. ఆయ‌న‌లోని ఎన‌ర్జీని ఆయ‌న స్టేజ్ షోలు చెబితే, ఆయ‌న పాట‌లు ఆయ‌న‌లోని సెన్సిబిలిటీస్‌, ఎమోష‌న్స్‌ను తెలియ‌జేస్తాయి. సినీ రంగ ప్ర‌వేశం చేసిన అతి కొద్ది కాలంలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయ్యారు దేవిశ్రీప్ర‌సాద్‌. చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేశ్‌, ప్ర‌భాస్‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మ‌హేశ్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్ వంటి నేటి త‌రం అగ్ర క‌థానాయ‌కుల సినిమాల‌కు కూడా దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందించారు. ఆదివారం(ఆగ‌స్ట్ 2) దేవిశ్రీ పుట్టిన‌రోజు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స‌హా సెల‌బ్రిటీలంద‌రూ దేవిశ్రీ ప్ర‌సాద్‌కు పుట్టినోజు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. 


‘‘హ్యాపీ బర్త్ డే రాక్‌స్టార్. నీ అద్భుతమైన సంగీతంలో మ్యూజిక్ చార్ట్ బస్టర్స్‌ను పాలించు. గ్రేట్ డే, స్టే సేఫ్’’అని మహేశ్ ట్వీట్ చేశారు. నా ప్రియమైన స్నేహితుడికి జన్మదిన శుభాకాంక్షలు. నా కెరీర్‌లో అత్యధిక చిత్రాలకు నువ్వే సంగీతం అందించావు. ఈ ఏడాది నీకు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని బన్నీ ట్వీట్ చేశారు. 

Advertisement
Advertisement
Advertisement