Abn logo
Apr 10 2020 @ 12:26PM

మళ్లీ మహేష్, త్రివిక్రమ్ కలుస్తున్నారా?

సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో `అతడు`, `ఖలేజా` సినిమాలు తెరకెక్కాయి. ఈ సినిమాలు ఇప్పటికీ టీవీల్లో విపరీతమైన ఆదరణను సంపాదించుకుంటున్నాయి. `ఖలేజా` తర్వాత వీరిద్దరూ ఇప్పటివరకు కలిసి పనిచేయలేదు. ఇద్దరి మధ్యా విభేదాలు తలెత్తాయని, అందుకే కలిసి పనిచేయడం లేదని గతంలో వార్తలు వచ్చాయి. 


ఈ నేపథ్యంలో వీరిద్దరి గురించి ఓ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఓ ప్రముఖ కంపెనీ  యాడ్ కోసం త్రివిక్రమ్, మహేష్ మళ్లీ కలిసి పనిచేయబోతున్నారట. ఆ యాడ్ తర్వాత మహేష్‌, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమాను కూడా నిర్మించేందుకు ప్రముఖ నిర్మాత ప్రయత్నిస్తున్నారట. వెంటనే కాకపోయినా రెండేళ్ల తర్వాతైనా వీరి కాంబినేషన్‌ను తెర మీదకు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరి, అదే జరిగితే మహేష్ అభిమానులకు శుభవార్తే. 

Advertisement
Advertisement
Advertisement