ప్రజలశాంతి కోసం మహాయజ్ఞం

ABN , First Publish Date - 2021-01-19T06:46:54+05:30 IST

అభ్యున్నతి కోసం శాంతి కలగాలని ధర్మజాగృతి మహాయజ్ఞం నిర్వహిస్తున్నామని ఆదిలాబాద్‌ ఎంపీ, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు అన్నారు.

ప్రజలశాంతి కోసం మహాయజ్ఞం
జంగుబాయి మాతను దర్శించుకుంటున్న ఎంపీ సోయం బాపురావు,

రాష్ట్ర ఆదివాసీ పోరాట తుడుందెబ్బ అధ్యక్షుడు ఎంపీ సోయం బాపురావు

మామడ, జనవరి 18 : అభ్యున్నతి కోసం శాంతి కలగాలని ధర్మజాగృతి మహాయజ్ఞం నిర్వహిస్తున్నామని ఆదిలాబాద్‌ ఎంపీ, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు అన్నారు. నిర్మల్‌ జిల్లా మామడ మండలంలోని రచ్చకోట గ్రామంలో  జంగుబాయి దేవుడికి మహాహోమం ఆదివాసీల ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభించారు. ఆదివాసీల ప్రధాన సమస్యలు పరి ష్కారం కావాలని, రాష్ట్ర ప్రభుత్వానికి కనివిప్పు కలగాలని, వలసవాద లంబ డాలను రిజర్వేషన్‌ జాబితా నుంచి తొలిగించాలని సంకల్పించారన్నారు. వారం రోజుల పాటు ఆదివాసీల ఆధ్వర్యంలో తన సొంతఖర్చులతో ఈ మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని మంచి పంటలు పండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఆధ్యాత్మికతతోనే మనస్సు ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. ఆదివాసీల సమస్యలు తొందరగా నెరవేరేలా చూడాలని దేవున్ని ప్రార్థిస్తున్నామన్నారు. అనంతరం జంగుబాయి అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. ఈ కార్యక్రమం వారంరోజులుగా కొన సాగుతుంది. కావునా ఆదివాసీ తొమ్మిది తెగల ప్రజలు సంఘ నాయకులు హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. తుడుందెబ్బ జిల్లా అధ్య క్షుడు వెంకగారి భూమయ్య, కార్యదర్శి ఉర్వేత ఆనంద్‌, ఉపాధ్యక్షుడు గోవర్ధన్‌, యూత్‌ అధ్యక్షుడు ఆనంద్‌, సాకి లక్ష్మణ్‌, సూరపు సాయన్న, మంద మల్లేష్‌, నారాయణ, శ్రీనివాస్‌, మాధవ్‌, తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-01-19T06:46:54+05:30 IST