మహావీరుడి స్ఫూర్తితో కరోనాపై పోరాటం

ABN , First Publish Date - 2020-04-06T07:38:31+05:30 IST

కరోనాతో మానవ జాతి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ తరుణంలో జీవితం పట్ల జైన మత గురువు వర్ధమాన మహవీరుడి సానుకూల దృక్పథాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఉపరాష్ట్రపతి...

మహావీరుడి స్ఫూర్తితో కరోనాపై పోరాటం

  • ప్రజలకు ఉప రాష్ట్రపతి వెంకయ్య పిలుపు
  • జయంతి సందర్భంగా శుభాకాంక్షలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5: కరోనాతో మానవ జాతి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ తరుణంలో జీవితం పట్ల జైన మత గురువు వర్ధమాన మహవీరుడి సానుకూల దృక్పథాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం మహవీరుడి జయంతి సందర్భంగా దేశ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ భూమ్మీద జీవించిన వారిలో మహవీరుడు అత్యంత ప్రభావశీలుడైన ఆధ్మాత్మికవేత్త. ఆయన సిద్ధాంతాలైన అహింస, నిజాయతీ, నిస్వార్థం చిరస్థాయిగా నిలిచి ఉంటాయి’ అని కొనియాడారు. కరోనాపై ప్రపంచమంతా ఒక్కటై పోరాడాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.


Updated Date - 2020-04-06T07:38:31+05:30 IST