మహాత్మాగాంధీ ఆదర్శ ప్రాయుడు

ABN , First Publish Date - 2022-10-03T05:26:53+05:30 IST

సత్యం, అహింస మార్గాల ద్వారా శాంతి యుతంగా భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ ప్రపంచానికి ఆదర్శప్రాయుడని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు అన్నారు.

మహాత్మాగాంధీ ఆదర్శ ప్రాయుడు
గాంధీజీకి నివాళ్లర్పిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

జయంతి వేడుకల్లో కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు

మహబూబ్‌నగర్‌ టౌన్‌/ మహబూబ్‌నగర్‌/ మహబూబ్‌నగర్‌ రూర ల్‌/ పాలమూరు/ గండీడ్‌/ అడ్డాకుల/ రాజాపూర్‌/ దేవరకరద్ర/ చిన్న చింతకుంట/ మిడ్జిల్‌/ మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం/ మహమ్మదాబాద్‌/ హన్వాడ, అక్టోబరు 2 : సత్యం, అహింస మార్గాల ద్వారా శాంతి యుతంగా భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ ప్రపంచానికి ఆదర్శప్రాయుడని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు అన్నారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఆయన జిల్లా కేంద్రంలోని క్లాక్‌ టవర్‌ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమా లలు వేసి ఘనంగా నివాళ్లర్పించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గాంధీజీ చిత్రపటానికి పూల మాలవేసి నివ్లాళ్ల ర్పించా రు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, జిల్లా అధికారులు కార్యక్రమంలో పాల్గొనగా, అంతకు ముందు క్లాక్‌టవర్‌ చౌరస్తాలో ఉన్న గాంధీజీ విగ్రహానికి మునిసిపల్‌ చైర్మన్‌ కె.సి.నర్సింహు లు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్‌, డిసీసీబీ ఉపాధ్యక్షులు కోరమోని వెంటయ్య, ముడా చైర్మన్‌ గంజి ఎంకన్న, పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఆదివారం డీసీసీ కార్యాలయం ఆవరణలో గాంధీతోపాటు లాల్‌బహ దూర్‌ శాస్త్రీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళ్ళర్పించారు.  కార్యక్ర మంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లాకొత్వాల్‌, నాయకులు వినోద్‌కుమార్‌, చంద్రకుమార్‌గౌడ్‌, సీజె బెనహర్‌, బెక్కరి అనిత, లక్ష్మణ్‌యాదవ్‌, శ్రీనివా స్‌గౌడ్‌, అజ్మత్‌అలీ, బాలస్వామి, కురుణకాంత్‌, సుభాష్‌ఖత్రి, తాహెల్‌, వెంకటలక్ష్మి, సుజాత పాల్గొన్నారు. 

 మహబూబ్‌నగర్‌రూరల్‌ మండల పరిషత్‌ కార్యాలయం, తహసీల్దార్‌ కార్యాలయం వద్ద మహాత్మాగాంధీ చిత్రపటానికి అధికారులు, ప్రజాప్రతి నిధులు పూలమాలలువేసి నివాళ్లర్పించారు. అదేవిధంగా కోడూరు పం చాయతీ వద్ద సర్పంచ్‌ శ్రీకాంత్‌గౌడ్‌, బొక్కలోనిపల్లిలో సర్పంచ్‌ యుగంధ ర్‌రెడ్డి, ఓబ్లాయిపల్లిలో సర్పంచ్‌ చంద్రకళ వెంకటస్వామి, కోటకదిరలో రమ్యాదేవేందర్‌రెడ్డి, జమిస్తాపూర్‌లో సర్పంచ్‌ బీ రామచంద్రయ్య, ఉపస ర్పంచ్‌ మొగిలయ్యగౌడ్‌ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు.

జిల్లా కేంద్రంలో గాంధీ విగ్రహానికి వైఎస్‌ఆర్‌టీపీ రాష్ట్ర నాయకులు ఆర్‌.రవిప్రకాష్‌ పూలమాలవేసి నివాళి అర్పించారు. మహేందర్‌, ముకుందాచారి, అక్షయ్‌కుమార్‌ పాల్గొన్నారు.  

గండీడ్‌ ఎంపీడీవో కార్యాలయం, వెన్నాచేడ్‌, గోవిందుపల్లి, ఆశిరెడ్డిపల్లి గ్రామాల్లో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు పుల్లారెడ్డి, గోపాల్‌, రవీందర్‌ నాయక్‌, చంద్రకళ, పెంట్యానాయక్‌, రామచంద్రారెడ్డి, నరేష్‌, ఎంపీడీవో రూపేందర్‌రెడ్డి, ఎంపీవో శంకర్‌ నాయక్‌, సిబ్బంది ఆయా గ్రామాల యువకులు పాల్గొన్నారు.

అడ్డాకుల మండలంలో గాంధీ, లాల్‌బహద్దూర్‌ శాస్ర్తీ చిత్రపటాలు, విగ్రహానికి టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు వేర్వేరుగా పూలదండలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమం లో పాల్గొన్న టీఆర్‌ఎస్‌ నాయకులు ఎంపీపీ నాగార్జున్‌రెడ్డి, జడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షు డు జితేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండ ల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ ఎస్‌ సీనియర్‌ నాయకుడు చంద్రమోహన్‌రెడ్డి, మండల కోఆప్షన్‌ ఖాజాఘోరి పాల్గొన్నారు. అదేవిధంగా డీసీసీ కార్యదర్శి విజయమోహన్‌ రెడ్డి, దేవర కద్ర మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు షఫిహమ్మద్‌, ఉప సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు పరశు రాములు, సీనియర్‌ నాయకుడు ఎం.రాములు పాల్గొన్నారు.

రాజాపూర్‌ మండల పరిషత్‌, తహసీల్దార్‌, గ్రామ పంచాయతీ కార్యాలయాలతోపాటు కాంగ్రెస్‌, బీజేపీ కార్యాలయాలలో మహాత్మాగాంధీ విగ్రహాలు, ఫొటోలకు నాయకులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

దేవరకద్ర మండల పరిషత్‌ ఆవరణలో గాంధీ విగ్రహానికి పూల మా లలు వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో  దేవరకద్ర ఎంపీపీ రమాశ్రీకాంత్‌, సర్పంచ్‌ కొండ విజయలక్ష్మి, ఎంపీడీవో శ్రీనివాసులు, నా యకులు పాల్గొన్నారు.ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నివాళ్లు అర్పించారు. 

మిడ్జిల్‌లో గాంధీ విగ్రహానికి జడ్పీటీసీ శశిరేఖబాలు, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు సత్యనారాయణగుప్తా, సర్పంచ్‌ రాధికావెంకట్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ అల్వాల్‌రెడ్డి, ఎంపీటీసీ గౌస్‌, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌, డీసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లెతిరుపతి, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు దాణియేలుతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

జిల్లా కేంద్రంలోని గాంఽధీ రోడ్‌ ఉన్నత పాఠశాలలో గాంధీ విగ్రహానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌ పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు  గోపాల్‌ యాదవ్‌, ముడా చైర్మన్‌ గంజి వెంకన్న, మునిపల్‌ వైస్‌ చైర్మ్‌ తాటి గణేష్‌,  మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ ముత్యాల ప్రకాష్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెరుకుపల్లి రాజేశ్వర్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్‌, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ భవన్‌లో గాంఽధీజీ చిత్రపటానికి పూల మాలలువేసి నివాళ్లు అర్పించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ్‌గౌడ్‌, రఘురమ్‌రెడ్డి, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు, రాజశేఖర్‌ గౌడ్‌, హరినాఽథ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని గాంధీరోడ్‌ ఉన్నత పాఠశాలలోని గాంధీ విగ్రహానికి తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మావిళ్ల లక్ష్మణ్‌గౌడ్‌, వెంకటనారా యణ పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఎంవీఎస్‌ డిగ్రీ పీజీ కళాశాలలో గాంధీ చిత్రపటాకి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రాఘవేందర్‌రెడ్డి, శివకుమార్‌, స్వరూప, నాగరాజు పాల్గొన్నారు

మహమ్మదాబాద్‌తో పాటు గాధిర్యాల్‌ మొకర్లబాద్‌ తదితర గ్రామాలలో గాంధీ జయంతి నిర్వహించారు. ఈ కారక్రమంలో మహమ్మ దాబాద్‌ సర్పంచ్‌ పార్వతమ్మరాజేశ్వర్‌, గాధిర్యాల్‌ సర్పంచ్‌ వెంకట్‌రామ్‌ రెడ్డి, సందోల్ల వెంకటయ్య, గ్రామ కార్యదర్శి హజీ, పుట్టి శంకరయ్య,  జమాల్‌పూర్‌ శ్రీనివాస్‌, పొగాకు ఆంజనేయులు, డి. కృష్ణయ్య, గండీడ్‌ చంద్రయ్య, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కేఎం నారాయణ, టీపీసీసీ అర్గనైజింగ్‌ సెక్రటరీ రాములు, నాయకులు రాఘవేందర్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, రహీం పాల్గొన్నారు .

హన్వాడతోపాటు మండలంలోని గ్రామాల్లో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ విజయలక్ష్మి, సర్పంచ్‌లు శ్రీదేవి, సరస్వతి, రేవతి, సత్యమ్మ, రాములమ్మ పాల్గొన్నారు.



Updated Date - 2022-10-03T05:26:53+05:30 IST