ఐరాసలో మహాత్మా గాంధీ సందేశం

ABN , First Publish Date - 2022-10-02T09:26:37+05:30 IST

ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యాలయంలో మహాత్మా గాంధీ శనివారం సందేశం ఇచ్చారు.

ఐరాసలో మహాత్మా గాంధీ సందేశం

ప్రొజెక్టర్‌తో గాంధీ హోలోగ్రామ్‌ ప్రదర్శన

ఐరాస, అక్టోబరు 1: ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యాలయంలో మహాత్మా గాంధీ శనివారం సందేశం ఇచ్చారు. విద్య ఆవశ్యకతను నొక్కి చెప్పారు. మహాత్మాగాంధీ ప్రసంగించడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? గాంధీ ప్రసంగించారనే భావన కలిగేలా యూఎన్‌లో భారత శాశ్వత మిషన్‌ యూఎన్‌ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ప్రొజెక్టర్‌ సాయంతో గాంధీ హోలోగ్రామ్‌ను (ఆయన చిత్రపటాన్ని) తెరపై ప్రదర్శించి, ఆయనే ప్రసంగిస్తున్నట్లుగా ఆడియో సందేశాన్ని వినిపించింది. గాంధీ హోలోగ్రామ్‌ను యూఎన్‌లో ప్రదర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అక్టోబర్‌ 2న గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా నిర్వహించుకోవాలని ఐక్యరాజ్య సమితి 2007లో తీర్మానం చేసింది. 

Updated Date - 2022-10-02T09:26:37+05:30 IST