మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-02-20T09:14:21+05:30 IST

మహాశివరాత్రి ఉత్సవాలు పురస్కరించుకు ని బుధవారం రాత్రి స్వామి, అమ్మవార్ల దివ్యకళ్యాణ మహోత్సవం

మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం

సామర్లకోటలో ఘనంగా భీమేశ్వరస్వామి కల్యాణం


సామర్లకోట, ఫిబ్రవరి 19: మహాశివరాత్రి ఉత్సవాలు పురస్కరించుకు ని బుధవారం రాత్రి స్వామి, అమ్మవార్ల దివ్యకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో పులి నారాయణమూర్తి ఆధ్వర్యం లో వేదపండితులు ఉత్సవమూర్తులను వేలాది భక్తుల మధ్య ఊరేగింపుగా కళ్యాణవేదిక వద్దకు తోడ్కొని వచ్చారు. వేదపండితులు వేమూరి సోమేశ్వర శర్మ, శ్రీపాదరాజశేఖర్‌ ఘనాపాటి, కొంతేటి జోగారావు, సన్నిధిరాజు సుబ్బన్న, శర్మ, రాంబాబు వేదమంత్రోచ్ఛారణల మధ్య కళ్యాణ మహోత్సవాన్ని నిర్వ హించారు.


ముందుగా పిఠాపురం రాజా గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించగా అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం తరపున పట్టు వస్ర్తాలను అన్నవరం వేదపండితులు అందజేశారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప దంపతులు, దవులూరి సుబ్బారావు దంపతులు వేదికపై ఆశీనులై కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు పట్టువస్ర్తాలను ఎమ్మెల్యే చినరాజప్ప అందజేశారు. అనంతరం పెద్దఎత్తున ప్రసాద వితరణ పురుషులకు జేబురుమాళ్లు, మహిళలకు రవిక వస్ర్తాలు అందజేశారు.


20వేలమంది భక్తులు ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించారు. వేద పండితులకు పండిత సత్కారం నిర్వహించారు. కార్యక్రమంలో పారిశ్రామిక వేత్తలు బిక్కిన పరమేశ్వరసాయి సత్యనారాయణ, సింగవరపు సాయిబాబు, పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, మట్టపల్లి రమేష్‌ బాబు, అడబాల కుమారస్వామి, కంటే జగదీశ్‌ మోహన్‌, బడుగు శ్రీకాంత్‌, చుండ్రు గోపాలకృష్ణ, ఆర్వీ సుబ్బరాజు, అంజనీకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-02-20T09:14:21+05:30 IST