ప్రశ్నించే నాయకులనే ఎన్నుకోండి

ABN , First Publish Date - 2022-08-18T07:35:04+05:30 IST

ప్రశ్నించే నాయకులు రావా లని.. అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని.. అటు వంటి వారికే ప్రజలు ఓటు వేసి అవకాశం ఇవ్వాలని సినీ నటుడు శివాజీ అన్నా రు. ప్రత్తిపాడు మండలంలో ని ఉత్తరకంచి గ్రామంలో బు ధవారం మహాసేన ఐదోవార్షి క వేడుకలకు హాజరై మాట్లాడారు. మహాసేన రాజేష్‌ ఒక వ్యక్తి కాదు శక్తిగా అన్నారు. మహాసేన అధ్యక్షుడు రాజేష్‌ మా ట్లాడుతూ మహాసేన ఆవశ్య కతను వివరించారు.

ప్రశ్నించే నాయకులనే ఎన్నుకోండి
మహాసేన వ్యవస్థాపక దినోత్సవ సభలో ఐకమత్యం చాటుతున్న పలువురు ప్రముఖులు

  • సినీ నటుడు శివాజీ

ప్రత్తిపాడు, ఆగస్టు 17: ప్రశ్నించే నాయకులు రావా లని.. అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని.. అటు వంటి వారికే  ప్రజలు ఓటు వేసి అవకాశం ఇవ్వాలని సినీ నటుడు శివాజీ అన్నా రు. ప్రత్తిపాడు మండలంలో ని ఉత్తరకంచి గ్రామంలో బు ధవారం మహాసేన ఐదోవార్షి క వేడుకలకు హాజరై మాట్లాడారు. మహాసేన రాజేష్‌ ఒక వ్యక్తి కాదు శక్తిగా అన్నారు. మహాసేన అధ్యక్షుడు రాజేష్‌ మా ట్లాడుతూ మహాసేన ఆవశ్య కతను వివరించారు. వైసీపీ ప్ర భుత్వంలో అవినీతి అక్రమాలు దారుణంగా పెరిగిపోయాయ ని, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు విమర్శించారు. తెలంగాణకు చెందిన తీన్మార్‌ మల్లన్న మాట్లాడుతూ అధికార వైసీపీ నేతల కు వ్యతిరేకంగా మహాసేన రాజేష్‌ పోరాటం అభినందనీయమ న్నారు. తెలంగాణ మాదిరిగానే ఆంధ్రలో కూడా ప్రశ్నించే వారి గొంతు నొక్కే పరిస్థితులు ఎదురవుతున్నాయన్నారు. రాష్ట్రంలో పవన్‌కల్యాణ్‌కు ఆదరణ పెరుగుతుందని జనసేన పార్టీ విధానాలు, కార్యక్రమాలకు ప్రజలు బాసటగా నిలుస్తున్నారని ఆ పార్టీ తాడేపల్లిగూడెం, పెద్దాపురం నియోజకవర్గాల ఇన్‌ చార్జ్‌లు బొలిశెట్టి శ్రీనివాస్‌, తుమ్మల బాబులు తెలిపారు. అనంతరం మహాసేన ప్రతినిధులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. 

Updated Date - 2022-08-18T07:35:04+05:30 IST