Jul 9 2021 @ 23:09PM

థియేటర్లలో కలుద్దాం సిద్ధార్థ్‌

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగా రూపొందుతున్న చిత్రం ‘మహాసముద్రం’. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా హీరోలిద్దరూ పిడికిలి బిగించిన ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ‘‘ఎనిమిదేళ్ల తర్వాత స్ట్రయిట్‌ తెలుగు చిత్రంతో మీ ముందుకు వస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ‘మహాసముద్రం’ చిత్రబృందానికి కృతజ్ఞతలు. థియేటర్లలో కలుద్దాం’’ అని సిద్ధార్థ్‌ తెలిపారు. ‘‘ఇటీవల కాలంలో పక్కా ప్రణాళికతో రూపొందిన చిత్రమిది.


ఎంతో పట్టుదలతో దర్శకుడు అజయ్‌ భూపతి చిత్రాన్ని తెరకెక్కించారు. నటీనటులందరూ అడ్డంకులను అధిగమించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు’’ అని చిత్రనిర్మాత సంస్థ ‘ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ అధినేత అనిల్‌ సుంకర చెప్పారు. హీరోయిన్లుగా అదితీరావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్‌, జగపతిబాబు, రావు రమేశ్‌, రామచంద్రరాజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌, సహ నిర్మాత: అజయ్‌ సుంకర, నిర్మాత: రామబ్రహ్మం సుంకర.