వాల్మీకి మహర్షి ఆదర్శనీయుడు

ABN , First Publish Date - 2021-10-21T05:35:21+05:30 IST

వాల్మీకి మమర్షి ఆదర్శనీయుడని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణవేణి పేర్కొన్నారు.మదనపల్లెలోని రాగిమానుసర్కిల్‌లో ఉన్న వాల్మీకి విగ్రహానికి వాల్మీకివీధి కులపెద్దలు, అదేవిధంగా వీఆర్పీఎస్‌ నాయకులు, వాల్మీకి మహాసేన నాయకు లు పూజలు చేశారు.

వాల్మీకి మహర్షి ఆదర్శనీయుడు
చిత్తూరుబస్టాండు వాల్మీకిసర్కిల్‌లో వాల్మీకి విగ్రహం ఎదుట వాల్మీకుల పూజలు

మదనపల్లె టౌన్‌, అక్టోబరు 20: వాల్మీకి మమర్షి ఆదర్శనీయుడని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణవేణి పేర్కొన్నారు. బుధవారం కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ మోహనవళ్లి ఆధ్వర్యంలో వాల్మీకిజయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ అడవుల్లో వేటాడే వ్యక్తి రామాయణంను రచించి జీవన విలువలను ప్రజలందరికీ తెలియజేశాడన్నారు.  వైస్‌ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


మదనపల్లె రూరల్‌:  రామాయణ సృష్టికర్త  వాల్మీకి మహర్షి జయంతిని మదనపల్లె పట్టణంతో పాటు మండలంలో వాల్మీకులు ఘనంగా నిర్వహిం చారు.  మదనపల్లెలోని  రాగిమానుసర్కిల్‌లో ఉన్న వాల్మీకి విగ్రహానికి వాల్మీకివీధి కులపెద్దలు, అదేవిధంగా వీఆర్పీఎస్‌ నాయకులు, వాల్మీకి మహాసేన నాయకు లు పూజలు చేశారు. అక్కడి నుంచి వాల్మీకి మహర్షి చిత్రపటంతో చెక్కభజనలు, బళ్లారి డ్రమ్స్‌తో  వాల్మీకి సర్కిల్‌వరకు ర్యాలీ నిర్వహించారు.  వీఆర్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు పొదల నరసింహులు మాట్లాడుతూ  వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని కోరారు. ఎస్టీసాధనకు చేపట్టే పోరాటంలో వాల్మీకులంతా కలసి రావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ జింకావెంకటాచలపతి, గ్రానైట్స్‌ అసోసియేషన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు వి.నారదరెడ్డి, బాస్‌ అధ్యక్షుడు పీటీయం శివప్రసాద్‌,  బీసీహెచ్‌పీఎస్‌  రాష్ట్ర అధ్యక్షుడు బోడెం రాజశేఖర్‌, వాల్మీకిమహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ముత్తరాశి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వాల్మీకిసర్కిల్‌, రాగిమానుసర్కిల్‌లో అన్నదానం చేశారు.  బీజేపీ జాతీయనేత చల్లపల్లె నరసింహారెడ్డి, విజయభారతి స్కూల్‌ కరస్పాండెంట్‌ ఎన్‌.సేతు,  బీజేపీ నాయకులు బర్నేపల్లె రవికుమార్‌, మధు, పూలకుంట హరి తదితరులు  పట్టణంలోని వాల్మీకిసర్కిల్‌లోని వాల్మీకి విగ్రహానికి పూజలు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీలుగా పునరుద్ధరించడానికి బీజేపీ  సహకరిస్తుందన్నారు. అదేవిధంగా చీకలబైలు గ్రామంలో వాల్మీకిసంఘం నాయకుడు సర్పంచి ప్రభాకర్‌ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలను జరుపుకున్నారు.  


పెద్దతిప్పసముద్రం:  మండలంలో వాల్మీకి సోదరులు బుధవారం వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. కందుకూరు, పులికల్లు, నవాబుకోట, టి.సదుం గ్రామాల్లో వాల్మీకి చిత్రపటాన్ని ఊరేగించారు.   



ములకలచెరువు: మండలంలోని సోంపల్లె పంచాయతీ తలారివారిపల్లెలో బుధవారం  వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాల్మీకి సేవాదళ్‌ రాష్ట్ర నాయకులు తలారి మంజునాఽథ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. 



బి.కొత్తకోట: బి.కొత్తకోట పట్టణం మండలంలోని బడికాయలపల్లెలో బుధవారం వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. బడికాయలపల్లెలోని వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం వీఆర్‌పీఎస్‌ నాయకులు అన్నదానం చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ లక్ష్మీనరసమ్మ, జడ్పీటీసీ సభ్యుడు రామచంద్ర,  సర్పంచు రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



రామసముద్రం:  స్థానిక చెక్క్‌పోస్టు కూడలిలో వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశంలోని కొన్ని రాష్ట్రాలల్లో వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించారని, మన రాష్ట్రంలో వాల్మీకులను  బీసీలుగా పరిగణించడం సరికాదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కుసుమకుమారి, ఆనంద్‌, సుకుమర్‌, వాలెప్ప, ఆంజిప్ప, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T05:35:21+05:30 IST