Maharashtra 12వ తరగతి కెమిస్ట్రీ పేపర్ లీక్

ABN , First Publish Date - 2022-03-14T17:18:45+05:30 IST

మహారాష్ట్ర బోర్డ్ 12వతరగతి కెమిస్ట్రీ ప్రశ్నపత్రం ముంబైలో లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి...

Maharashtra 12వ తరగతి కెమిస్ట్రీ పేపర్ లీక్

కోచింగ్ సెంటర్ యజమాని అరెస్ట్

ముంబై : మహారాష్ట్ర బోర్డ్ 12వతరగతి కెమిస్ట్రీ ప్రశ్నపత్రం ముంబైలో లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. విద్యార్థుల ఫోన్‌లో కెమిస్ట్రీ ప్రశ్నపత్రం ఉండడంతో వారు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చారు. కెమిస్ట్రీ 12వ తరగతి పేపర్ లీకేజీకి సంబంధించి మలాడ్‌లోని ఓ ప్రైవేట్ కోచింగ్ క్లాస్ టీచర్‌ని విలేపార్లే పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ప్రైవేట్ తరగతులను నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడి పేరు ముఖేష్ యాదవ్. ఈ ప్రైవేట్ ట్యూటర్ పరీక్షకు ముందు తన ముగ్గురు విద్యార్థులతో వాట్సాప్‌లో ఈ పేపర్‌ను పంచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రశ్నపత్రం లీకేజీ అయిన సమయంలో ముఖేష్ ముంబైలోని మలాడ్‌లో ప్రైవేట్ ట్యూషన్ చెబుతున్నాడని పోలీసులు చెప్పారు. ముఖేష్ తరగతిలో 12వ తరగతిలో దాదాపు 15 మంది విద్యార్థులు ఉన్నారు.మహారాష్ట్రలో పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు ట్విటర్‌లో ఆరోపించారు.


Updated Date - 2022-03-14T17:18:45+05:30 IST