పోలీసులే దొంగలైన వేళ...రూ.6కోట్ల దోపిడీ...10 మంది సస్పెన్షన్

ABN , First Publish Date - 2022-05-12T14:26:36+05:30 IST

రక్షించాల్సిన రక్షకభటులే భక్షకులుగా మారి దోపిడీ దొంగలైన వింత ఉదంతం మహారాష్ట్రలోని థానే నగరంలో వెలుగుచూసింది....

పోలీసులే దొంగలైన వేళ...రూ.6కోట్ల దోపిడీ...10 మంది సస్పెన్షన్

థానే(మహారాష్ట్ర): రక్షించాల్సిన రక్షకభటులే భక్షకులుగా మారి దోపిడీ దొంగలైన వింత ఉదంతం మహారాష్ట్రలోని థానే నగరంలో వెలుగుచూసింది. థానేలో స్థానిక నివాసి నుంచి రూ.6 కోట్లు దోచుకున్న 10 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది.థానే నివాసి ఇంట్లో చోరీకి పాల్పడినట్లు పోలీసు అధికారులపై థానే పోలీసు కమిషనర్ జై జీత్ సింగ్ దృష్టికి వచ్చింది. ఈ ఫిర్యాదు లేఖ మహారాష్ట్ర హోం మంత్రికి కూడా వచ్చింది. ఫిర్యాదు లేఖ రావడంతో విచారించగా నేరం రుజువైంది. ముంబ్రా పోలీసు ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు,పోలీసు సిబ్బంది, ఇతర యూనిఫాం లేని వ్యక్తులు ఏప్రిల్ 12వతేదీన తెల్లవారుజామున ఫైజల్ మెమన్ అనే వ్యక్తి నివాసంపై దాడి చేశారు.


పోలీసు అధికారులు మెమన్ నివాసానికి చేరుకోగా కోటి రూపాయలు చొప్పున ఉన్న ముప్పై పెట్టెలు దొరికాయని లేఖలో పేర్కొన్నారు. అన్ని పెట్టెలను సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ క్యాబిన్‌లోని ముంబ్రా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మెమన్‌కు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని షెవాలే ప్రశ్నించడం మొదలుపెట్టారు.అదంతా తాను కష్టపడి సంపాదించిన డబ్బు అని మెమన్ పోలీసులకు చెప్పాడు. అయితే షెవాలే, అతని జూనియర్లు అతన్ని నమ్మలేదు. అతనిపై దాడి చేసి కొట్టారు.పోలీసులు మెమన్‌తో సగం మొత్తాన్ని తమకు ఇవ్వాలని చెప్పారని, అయితే అతను షెవాలేకు రూ.2 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించాడు. అయితే పోలీసులు రూ.6కోట్లు తీసుకుని మిగిలిన రూ.24కోట్లను తిరిగి మెమన్ కు అప్పగించారు.


నిందితుల్లో ఒకరిని ముంబ్రా పోలీస్ స్టేషన్‌లోని క్రైమ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా గుర్తించారు, గీతారామ్ షెవాలే, అతని జూనియర్ అధికారులు, పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ (పిఎస్‌ఐ) రవి మద్నే, పిఎస్‌ఐ హర్షల్ కాలేలుగా గుర్తించారు.ఇన్‌స్పెక్టర్ క్యాబిన్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితులైన పోలీసు అధికారులపై కేసు నమోదు చేయవచ్చని లేఖలో పేర్కొన్నారు.ఫిర్యాదు మేరకు నిందితులైన పోలీసు అధికారులపై పోలీసు కమిషనర్ జై జీత్ సింగ్ విచారణ జరిపి, నిందితులుగా తేలిన పది మంది పోలీసులను బుధవారం సస్పెండ్ చేశారు.


Read more