మహారాష్ట్రలోనూ కాలుపెట్టిన జికా.. తొలి కేసు నమోదు!

ABN , First Publish Date - 2021-08-01T03:25:37+05:30 IST

మహారాష్ట్రలో తొలి జికా వైరస్ కేసు వెలుగులోకొచ్చింది.

మహారాష్ట్రలోనూ కాలుపెట్టిన జికా.. తొలి కేసు నమోదు!

ముంబై: మహారాష్ట్రలో తొలి జికా వైరస్ కేసు వెలుగులోకొచ్చింది. పూణె జిల్లాకు చెందిన ఓ మహిళ ఈ వైరస్ బారిన పడ్డారు. బెల్సార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందిన ఆమె ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారని అక్కడి అధికారులు తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులెవరికీ ఈ వైరస్ సోకలేదని సమాచారం. కాగా.. బాధితురాలు నివసిస్తున్న ప్రాంతంలో ఇటీవల పలువురు తమకు జ్వర లక్షణాలు ఉన్నాయని చెప్పడంతో క్విక్ రెస్పాన్స్ బృందాన్ని ప్రభుత్వం అక్కడికి పంపించింది. ఈ బృందంలోని అధికారులు స్థానికులకు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఆ ప్రాంతంలో మరో మూడు చికున్ గున్యా కేసులు కూడా వెలుగు చూసినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ కేవలం కేరళలో మాత్రమే జికా వైరస్ కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-08-01T03:25:37+05:30 IST