మహారాష్ట్రలో కొత్తగా 6218 కరోనా కేసులు నమోదు!

ABN , First Publish Date - 2021-02-24T01:44:33+05:30 IST

మహారాష్ట్రలో గత 24 గంటల్లో కొత్తగా 6 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా సమాచారం ప్రకారం.. మంగళవారం నాడు కొత్తగా 6218 కేసులు నమోదయ్యాయి. 51 కరోనా మరణాలు సంభవించాయి.

మహారాష్ట్రలో కొత్తగా 6218 కరోనా కేసులు నమోదు!

ముంబై: మహారాష్ట్రలో గత 24 గంటల్లో కొత్తగా 6 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా సమాచారం ప్రకారం.. మంగళవారం నాడు కొత్తగా 6218 కేసులు నమోదయ్యాయి. 51 కరోనా మరణాలు సంభవించాయి. మరోవైపు..కరోనా కట్టడి కోసం అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంటోంది. విదర్భ ప్రాంతంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో పర్భనీ ప్రాంతం వారు విదర్భలోకి వెళ్లకూడదంటూ పర్భనీ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు అర్థరాత్రి నుంచి ఫిబ్రవరి 28వరకూ ఈ నిబంధన అమల్లో ఉండనుంది. ఇది ప్రైవేటు, ప్రజారవాణా వ్యవస్థలకు కూడా వర్తిస్తుందని కలెక్టర్ తెలిపారు. ప్రజల రాకపోకలకు చెక్ పెట్టేందుకు సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. అయితే..అత్యవసర విధుల్లోని సిబ్బందికి మాత్రం ఆర్‌టీ పీసీఆర్ టెస్టులో నెగెటివ్ అని వచ్చాక విదర్భలో అడుగుపెట్టేందుకు అనుమతి ఉంది.  

Updated Date - 2021-02-24T01:44:33+05:30 IST